నాగ‌శౌర్య టైటిల్‌: ‘లక్ష్య‌’

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. త‌న చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్ర‌స్తుతానికి రెండు సినిమాలైతే సెట్స్‌పై ఉన్నాయి. వాటిలో.. సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. నాగ‌శౌర్య 20వ చిత్ర‌మిది. ఇందులో శౌర్య ఓ విలుకారుడిగా క‌నిపించ‌నున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో న‌డిచే క‌థ ఇది. ఇందుకోసం నాగ‌శౌర్య‌… త‌న శ‌రీరాకృతి కూడా మార్చుకున్నాడు. ఈసినిమా టైటిల్ ఏమిట‌న్న‌ది ఈరోజు సాయింత్రం 5 గంట‌ల‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతోంది చిత్ర‌బృందం.

అయితే ఈసినిమాకి `ల‌క్ష్య‌` అనే పేరు పెట్టిన‌ట్టు తెలుస్తోంది. `అర్జున‌` అనే మ‌రో పేరు ప‌రిశీలించినా… అదే పేరుతో తెలుగులో ఓ సినిమా రూపుదిద్దుకుంది. రాజ‌శేఖ‌ర్ హీరో. అది ఇప్ప‌టి వ‌ర‌కూ రిలీజ్ కాలేదు కూడా. ఆ సెంటిమెంట్ తో.. ఆ టైటిల్ ప‌క్క‌న పెట్టి, `ల‌క్ష్య‌`ని ఓకే చేశారు. కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నాడు. కృతికా శ‌ర్మ కథానాయిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార‌త్ సేనకు అద్భుతం.. టెస్ట్ సిరీస్ కైవ‌సం

టెస్టు సిరీస్ విజ‌యం, అందులోనూ ప‌రాయి గ‌డ్డ‌పై, అదీ.. ఆసీన్ లాంటి బ‌ల‌మైన జ‌ట్టుపై - ఏ జ‌ట్టుకైనా ఇంత‌కంటే గొప్ప కల ఏముంటుంది? ఆ క‌ల‌ని నిజం చేసింది భార‌త...

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేత..!

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అక్రమంగా ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టిందని.. ఆ కేసులు చెల్లవని వాదిస్తూ...

గోపీచంద్ – బాల‌య్య‌.. ఫిక్స్

క్రాక్ తో.. ట్రాక్ లోకి వ‌చ్చేశాడు గోపీచంద్ మ‌లినేని. ఈ సంక్రాంతికి అదే బిగ్గెస్ట్ హిట్. రెగ్యుల‌ర్ క‌థే అయినా.. క‌థ‌నంలో చేసిన మ్యాజిక్‌, ర‌వితేజ హీరోయిజం, శ్రుతి హాస‌న్ పాత్ర‌ని వాడుకున్న...

బెంగాల్‌లో దీదీ తృణమూల్ వర్సెస్ బీజేపీ తృణమూల్..!

భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు నేతలంతా... ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు.. సిద్ధాంతాలను నేర్చుకున్నవారే్ అయి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల్లో నేతలందర్నీ గుంపగుత్తగా చేర్చుకుని బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close