ప‌వ‌న్ చుట్టూ తిరుగుతున్న మ‌రో ద‌ర్శ‌కుడు

చేతిలో ఉన్న సినిమాల‌న్నీ ఎప్పుడు పూర్త‌వుతాయో తెలీదు గానీ, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం… వ‌రుస‌గా `మాట‌` ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. అలా.. ప‌వ‌న్ నుంచి ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడికి భ‌రోసా ల‌భించింది. మ‌రో కాంబినేష‌న్ దాదాపు సెట్ అయ్యింది. కాక‌పోతే.. అదెప్పుడో, ఎవ్వ‌రికీ అర్థం కాని ఫ‌జిల్‌. ప‌వ‌న్ భ‌రోసా అందుకున్న‌వాళ్లెవ‌రో కాదు.. జానీ మాస్ట‌ర్‌.

ప‌వ‌న్ చేతిలో వ‌కీల్ సాబ్ ఉందిప్పుడు. సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. కానీ.. అది సాధ్య‌మ‌య్యేలా లేదు. ఈ సినిమాని ప‌వ‌న్ ఎప్పుడు పూర్తి చేస్తాడో క్లారిటీ లేదు. ఆ త‌ర‌వాత క్రిష్‌, హ‌రీష్ శంక‌ర్‌లు లైన్లో ఉన్నారు. మ‌ధ్య‌లో… `అప్ప‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` రీమేక్ ఉంది. ఇవ‌న్నీ ఉండ‌గానే… జానీ మాస్ట‌ర్ కి సైతం.. ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కొరియోగ్రాఫ‌ర్ గా జానీ మాస్ట‌ర్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈమ‌ధ్య టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన పాట‌ల‌న్నింటికీ ఆయ‌నే కొరియో గ్రాఫ‌ర్‌. త‌న‌కెప్ప‌టి నుంచీ మెగాఫోన్ ప‌ట్టాల‌ని వుంది. త‌న‌కిష్ట‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో ఓ సినిమా చేయాల‌ని ఆశ ప‌డుతున్నాడు. రెండేళ్ల క్రిత‌మే ఈ ప్ర‌య‌త్నం మొద‌లైంది. ప‌వ‌న్‌ని త‌ర‌చూక‌లుస్తూనే ఉన్నాడు. ఈమ‌ధ్య వ‌కీల్ సాబ్ సెట్లో కూడా జానీ మాస్ట‌ర్ ప‌వ‌న్ ని క‌లిశాడ‌ని, లైన్ చెప్పేశాడ‌ని టాక్‌. ప‌వ‌న్ కూడా జానీతో సినిమా చేయ‌డానికి సానుకూలంగానే ఉన్నాడ‌ట‌. ప‌వ‌న్ ఎప్పుడంటే అప్పుడు జానీ మాస్ట‌ర్ మెగా ఫోన్ ప‌ట్టుకోవ‌డానికి సిద్ధం. పవ‌న్‌తో సినిమా ఎంత ఆల‌స్య‌మైనా స‌రే, ఆయ‌న సినిమాతోనే డైరెక్ట‌ర్‌గా అడుగుపెడ‌తాన‌ని, ఈలోగా కొరియోగ్ర‌ఫీ చేసుకుంటానని అంటున్నాడు జానీ మాస్ట‌ర్‌. సో.. ప‌వ‌న్ లిస్టులో మ‌రో ద‌ర్శ‌కుడు చేరిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార‌త్ సేనకు అద్భుతం.. టెస్ట్ సిరీస్ కైవ‌సం

టెస్టు సిరీస్ విజ‌యం, అందులోనూ ప‌రాయి గ‌డ్డ‌పై, అదీ.. ఆసీన్ లాంటి బ‌ల‌మైన జ‌ట్టుపై - ఏ జ‌ట్టుకైనా ఇంత‌కంటే గొప్ప కల ఏముంటుంది? ఆ క‌ల‌ని నిజం చేసింది భార‌త...

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టివేత..!

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అక్రమంగా ప్రభుత్వం కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టిందని.. ఆ కేసులు చెల్లవని వాదిస్తూ...

గోపీచంద్ – బాల‌య్య‌.. ఫిక్స్

క్రాక్ తో.. ట్రాక్ లోకి వ‌చ్చేశాడు గోపీచంద్ మ‌లినేని. ఈ సంక్రాంతికి అదే బిగ్గెస్ట్ హిట్. రెగ్యుల‌ర్ క‌థే అయినా.. క‌థ‌నంలో చేసిన మ్యాజిక్‌, ర‌వితేజ హీరోయిజం, శ్రుతి హాస‌న్ పాత్ర‌ని వాడుకున్న...

బెంగాల్‌లో దీదీ తృణమూల్ వర్సెస్ బీజేపీ తృణమూల్..!

భారతీయ జనతా పార్టీలో ఒకప్పుడు నేతలంతా... ఆరెస్సెస్ నుంచి వచ్చిన వారు.. సిద్ధాంతాలను నేర్చుకున్నవారే్ అయి ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇతర పార్టీల్లో నేతలందర్నీ గుంపగుత్తగా చేర్చుకుని బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close