సుకుమార్‌ని ‘లాక్‌’ చేసిన మ‌హేష్‌

సినిమా త‌ర‌వాత సినిమా అన్న‌ది మ‌హేష్ బాబు ప‌ద్ధ‌తి. ముందు నుంచీ ఇంతే. అయితే.. మిగిలిన హీరోలు అలా లేరు. ఓ సినిమా చేతిలో ఉండ‌గానే, మ‌రో సినిమాని లాక్ చేస్తున్నారు. మ‌హేష్ మాత్రం ఓ సినిమా పూర్త‌య్యాకే.. మ‌రో సినిమా ఆలోచ‌న చేస్తుండ‌డంతో, త‌న‌కు త‌గిన ద‌ర్శ‌కులు దొర‌క‌డం లేదు. ఉన్న వాళ్ల‌తో స‌ర్దుబాటు అయినా.. సూప‌ర్ హిట్లు కొట్ట‌గ‌లుగుతున్నాడు. అదే. తాను కోరిన ద‌ర్శ‌కులు వ‌స్తే..?

అందుకే… మ‌హేష్ ప్లాన్ మారింది. మిగిలిన హీరోల్లా ద‌ర్శ‌కుల్ని లైన్ లో పెట్టుకుంటున్నాడు. ఆమ‌ధ్య మ‌హేష్ – త్రివిక్ర‌మ్ ల మ‌ధ్య భేటీ జ‌రిగింది. వీళ్ల కాంబినేష‌న్‌లో ఓ సినిమా రావ‌డం ఖాయం. లేటెస్టుగా సుకుమార్ తోనూ మ‌హేష్ ట‌చ్‌లోకి వెళ్లాడ‌ని స‌మాచారం. వీరిద్ద‌రి కాంబోలో `నేనొక్క‌డినే` వ‌చ్చింది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఆ ప్ర‌య‌త్నం నిరాశ ప‌రిచినా – క్రిటిక్స్ మ‌న‌సుల్ని గెలుచుకుంది. సుకుమార్‌పై మహేష్ న‌మ్మ‌కం స‌డ‌ల్లేదు. అందుకే సుక్కుతో మ‌రో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు. లాక్ డౌన్ స‌మ‌యంలో మ‌హేష్ కి స‌రిప‌డా ఓ లైన్ సిద్ధం చేశాడ‌ట సుకుమార్‌. `పుష్ఫ‌` అయ్యాక‌… విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సుకుమార్ ఓ సినిమా చేయాలి. ఆ త‌ర‌వాతే.. మ‌హేష్ ప్రాజెక్టు ఉంటుంది. ఎంత కాద‌న్నా 2024 వ‌ర‌కూ ఈ కాంబోని చూడ‌డం క‌ష్టం. ఎందుకంటే.. మ‌హేష్ కూడా అంత బిజీనే. కాక‌పోతే… సుకుమార్ ని లైన్‌లో పెట్టుకోవ‌డం వ‌ల్ల‌.. త‌న త‌దుప‌రి సినిమాల‌కు ద‌ర్శ‌కుల్ని వెదికే ప‌ని త‌ప్పిందంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close