షాకివ్వబోతున్న ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ..!?

తెలుగుదేశం పార్టీ రాజధాని తరలింపును అడ్డుకోవాలని.. తమకు ఉన్న పరిమిత బలంతోనే తీవ్ర ప్రయత్నాలు చేయాలని భావిస్తోంది.కానీ ఇందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంత సీరియస్‌గా లేరన్న విషయం టీడీఎల్పీ భేటీతో తేలిపోయింది. ఏకంగా ఏడుగురు ఎమ్మెల్యేలు టీడీఎల్పీ భేటీకి డుమ్మాకొట్టారు. వీరిలో ఇద్దరు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి.. జగన్‌ను కలిసి.. తమ రూట్ సెపరేట్ అని చెప్పారు. మిగతా అందరూ..అయినా.. టీడీపీకి మద్దతుగా నిలుస్తారని అనుకుంటే.. ఎలాంటి వ్యూహం ఖరారు చేసుకోవాలనే దానిపై పెట్టుకున్న సమావేశానికి మరో ఐదుగురు డుమ్మా కొట్టారు. గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేష్, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్ , ఆదిరెడ్డి భవాని.. .. డుమ్మాకొట్టిన వారి జాబితాలో ఉన్నారు. వీరిలో గంటా , వాసుపల్లి, బెందాళం అశోక్ ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు.

గంటా శ్రీనివాసరావు విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానికి మద్దతు పలికారు. ఆయన టీడీపీలోఉంటానని ప్రకటనలు చేస్తున్నారు కానీ.. ఆ పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు. అయితే.. వీరందరూ.. వ్యక్తిగత పనుల వల్ల.. టీడీఎల్పీ సమావేశానికి రాలేకపోతున్నట్లుగా ముందుగానే సమాచారం పంపినట్లుగా.. తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా అసెంబ్లీకి హాజరవుతారని అంటున్నారు. అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం… రాజధాని తరలింపు అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. టీడీపీని మానసికంగా దెబ్బకొట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది.

ఇలాంటి సమయంలో.. ఎమ్మెల్యేలు.. కీలకసమావేశాలు హాజరు కాకపోయినా అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. గంటా తప్పా.. మిగిలిన నలుగురూ.. టీడీపీ తరపున గట్టిగా నిలబడిన వాళ్లే. వారిలో ఎర్రన్నాయుడు కుమార్తె కూడా ఉంది. కాబట్టి.. వారిని… అనుమానించాల్సిన పని లేదని… టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే......

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

HOT NEWS

[X] Close
[X] Close