ఇవాళ ‘తమ్ముళ్లు’ గైర్హాజరు…రేపు టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది?

ఏపీలో రేపు ఏం జరగబోతోంది? ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లు ఎలా ప్రవేశపెట్టబోతోంది? ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలా అడ్డుకోబోతోంది? ప్రభుత్వ నిర్ణయం ఏవిధంగా ఉండబోతోంది?…ఇలాంటి ఉత్కంఠభరితమైన ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. అసెంబ్లీలో అధికారపక్షమైన వైకాపాకు బండ మెజారిటీ ఉంది. అక్కడ ఎలాంటి ప్రాబ్లెం లేదు. శాసన మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. 

సహజంగానే అక్కడ ఇతర పక్షాలు టీడీపీకే బాసటగా ఉంటాయి. ఇదిలా ఉండగా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన పార్టీ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. ఐదుగురు ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరు కాలేదని వార్తలొచ్చాయి. మూడు రాజధానులును సమర్థిస్తున్న విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు రాలేదు. వీరిలో కీలక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గైర్హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నామని వర్తమానం పంపారు. 

హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు బావమరిది కమ్‌ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ హాజరైనట్లుగా లేదు. టీడీపీ అనుకూల ఛానెల్‌ వార్తల్లో ఆయన కనబడలేదు. ఆయన గురించి ప్రస్తావన కూడా లేదు. ఈరోజు హాజరుకానివారంతా రేపు అసెంబ్లీకి, మండలికి తప్పకుండా హాజరవుతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులందరికీ తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ విప్‌ జారీ చేసింది. జగన్‌కు మద్దతు ఇస్తూ టీడీపీకి దూరంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, గిరిధర్‌కు కూడా విప్‌ జారీ అయింది. విప్‌ జారీ అయ్యాక తప్పకుండా హాజరుకావల్సిందే. 

రపు ఏపీ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజు. చరిత్ర మలుపు తిరిగే రోజు. అయినప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. అధినేత ఆదేశాన్ని ధిక్కరించారు. గైర్హాజరైన ప్రజాప్రతినిధులకు అమరావతిపై ఇంట్రెస్టు లేదా? అనే సందేహం కలుగుతోంది. టీడీపీకే కాదు, వ్యక్తిగతంగా కూడా చంద్రబాబుకు ఈ రోజు సమావేశం చాలా కీలకమైంది. అయినా చాలామంది తమ్ముళ్లు రాలేదంటే ఏమనుకోవాలి? టీడీపీకి బలం ఉన్నది మండలిలోనే. అక్కడ అధికార పార్టీకి కేవలం తొమ్మిదిమంది సభ్యులే ఉన్నారు. కాని మండలి సభ్యులే ఎక్కువమంది సమావేశానికి డుమ్మా కొట్టారు. 

మూడు రాజధానులపై సీఎం జగన్‌ ఇప్పటికే బాబును ఇరికించేశారని కొందరు భావిస్తున్నారు. 2014లో చంద్రబాబు అనుసరించిన విధానాన్నే అనుసరించి దెబ్బ కొడతారని అనుకుంటున్నారు. అప్పట్లో చంద్రబాబు రాజధాని అమరావతిపై తనకు తానే నిర్ణయం తీసుకున్నారు. ఎవ్వరితోనూ చర్చించలేదు. అఖిలపక్ష సమావేశం పెట్టాలని కోరినా పట్టించుకోలేదు. అసెంబ్లీలోనే ప్రకటించి అమరావతిపై ఎస్‌ ఆర్‌ నో అనేది చెప్పాలని జగన్‌ను అడిగారు. చర్చ లేకుండా ప్రకటించాక తానేం చెప్పగలనని అన్న జగన్‌ గత్యంతరం లేక అమరావతికి అంగీకరించారు. 

రేపు అదే విధానంలో జగన్‌, బాబును అభిప్రాయం అడుగుతారని, బాబు విశాఖకు నో అని నేరుగా చెప్పలేక వాకౌట్‌ (పార్టీ సభ్యులంతా) చేస్తారని అంటున్నారు. అయితే ఇలా చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారుగాని అలా జరుగుతుందో లేదో తెలియదు. అసెంబ్లీ ముట్టడికి చంద్రబాబు పిలుపునిచ్చారు కాబట్టి వాకౌట్‌ చేస్తారని రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నారు. చూడాలి రేపు సీన్‌ ఎలా ఉంటుందో…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే......

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

HOT NEWS

[X] Close
[X] Close