దొర‌సానికి మ‌రో ఛాన్స్

దొర‌సాని సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాత్మిక‌. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే శివాత్మిక లుక్స్ మాత్రం ఆక‌ట్టుకున్నాయి. గ్లామ‌ర‌స్‌గానూ క‌నిపించింది. న‌ట‌న‌కు మార్కులు ప‌డ్డాయి. అందుకే ఇప్పుడు త‌న‌కు మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చింది. అరుణ్ అదిత్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి దుర్గా న‌రేష్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఇదో రొమాంటిక్ క్రైమ్ స్టోరీ. వినోదానికి స్కోప్ ఉంద‌ట‌. ఇందులో శివాత్మిక మోడ్ర‌న్ అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది. సోమ‌వారం నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఒక‌ప్ప‌టి గ్లామ‌ర్ తార ఇంద్ర‌జ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. పోసాని, కోట శ్రీ‌నివాస‌రావు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com