క్రాస్ ఓటింగ్ లేదు – క్రాస్‌చెక్‌ చేసి చెబుతున్న టీడీపీ!

ఏపీలో ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ ఇప్పుడు చర్చనీయాంశమయింది. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారంటూ వైసీపీ వారిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వారిలో ఇద్దరు ఇంతకు ముందే పార్టీకి దూరమయ్యారు. ఇద్దరు తమను సస్పెండ్ చేసినందుకు సంతోషం అంటున్నారు. కానీ తాము క్రాస్ ఓటింగ్ చే్శామని మాత్రం అంగీకరించడం లేదు. తమను సస్పెండ్ చేస్తే మంచిదే కానీ.. క్రాస్ ఓటింగ్ చేశామన్న నింద మాత్రం వేయవద్దని వారంటున్నారు.

మరో వైపు టీడీపీ కూడా ఈ అంశం వైసీపీ అంతర్గత అంశమని.. తమ పార్టీకి ఏం సంబంధం లేదని అంటున్నారు. తమకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తాము విప్ జారీ చేశామని వారంతా ఓటు వేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికైతే ఈ అంశంపై స్పందించకూడదని డిసైడయ్యారు. సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యేల చేరిక.. సీట్ల కేటాయింపుల అంశంపై ఇప్పుడల్లా మాట్లాడకూడదని నిర్ణయించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పిటకే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

టీడీపీ ఎవరితోనూ క్రాస్ ఓటింగ్ కోసం చర్చలు జరపలేదని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీకి దూరమైన ఇద్దరు ఎమ్మెల్యేలను వైసీపీ నేతలు లెక్కలోకి తీసుకోలేదు. వారు ఓటు వేయలేదు. మిగిలిన రెండు ఓట్లలో ఎవరు ఓటు వేశారో స్పష్టత లేదు. మేకపాటి కానీ.. ఉండవల్లి శ్రీదేవి కానీ టీడీపీ నేతలతో టచ్‌ లోకి ఎప్పుడూ రాలేదని చెబుతున్నారు. వీరు జగన్ పై వ్యతిరేకతతో షాక్ ఇచ్చి ఉంటారని అంటున్నారు. ఈ మత్తం వ్యవహారంలో టీడీపీ మాత్రం మాకు 23 మంది ఎమ్మెల్యేలు.. మాకు వచ్చిన ఓట్లు 23 అనే దానికి ఫిక్సయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ విన్న‌ర్ కిరీటాన్ని అందుకున్న సౌజ‌న్య భాగ‌వ‌తుల‌ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్షించుకున్న తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకెళ్తోన్న...

బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు ....

కాంగ్రెస్ పిలిస్తే కోదండరాం కూడా రెడీ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పని చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. తాజాగా కోదండరాం కూడా రెడీ అయ్యారు. తెలంగాణ పరిరక్షణకు.. ప్రజాస్వామ్య తెలంగాణకు టీజేఎస్ కృషి చేస్తోందని..తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడంకోసం తెలంగాణ...

నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి!

ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేసే టీడీపీ నేతల ఇళ్లపైకి రౌడీముకల్ని పంపి దాడులు చేయించడం ... పోలీసులు చూస్తూ ఉండటం కామన్ గా మారిపోయింది. గతంలో పట్టాభి ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close