మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకా వీడియోలు ఉన్నాయా?

మంచు ఇంట్లో… అన్నాద‌మ్ముల గొడ‌వ‌తో కాక పుట్టిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌నోజ్ ఓ వీడియో విడుద‌ల చేయ‌డంతో… విష్ణుతో త‌న‌కున్న విబేధాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శుక్ర‌వారం అంతా ఇదే హాట్ టాపిక్‌. ఆ త‌ర‌వాత‌.. మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో ఆ వీడియో డిలీట్ చేశాడు. మోహ‌న్‌బాబు కూడా వెంట‌నే రంగంలోకి దిగి డామేజ్ కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. `అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ‌లు కామ‌న్‌` అని మంచు ల‌క్ష్మీ స‌ర్ది చెబుతోంది. అయితే.. మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకొన్ని వీడియోలు ఉన్నాయ‌ని, త్వ‌ర‌లోనే వాటిని సైతం సోష‌ల్ మీడియాలో పెట్ట‌బోతున్నాడ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

మంచు సోద‌రుల మ‌ధ్య విబేధాలు ఇప్ప‌టివి కావు. ఎప్ప‌టి నుంచో న‌డుస్తున్న‌వే. అవ‌న్నీ..నివురుగ‌ప్పిన నిప్పులా ఉండేవి. నిన్న ఒకేసారి భ‌గ్గుమ‌న్నాయి. మ‌నోజ్ విడుద‌ల చేసిన వీడియో ఇప్ప‌టిది కాద‌న్న‌ది స‌న్నిహిత వ‌ర్గాల మాట‌. ఇలాంటి వీడియోలు మ‌నోజ్ ద‌గ్గ‌ర చాలా ఉన్నాయ‌ట‌. వాటిని సైతం మ‌నోజ్ సోష‌ల్ మీడియాలో పెట్టేస్తాడేమో అన్న‌ది మంచు కుటుంబ స‌భ్యుల ఆందోళ‌న‌. మోహ‌న్ బాబు క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాణం ఇచ్చే మ‌నిషి. అందుకే.. వెంట‌నే ఈ వ్య‌వ‌హారంపై స్పందించారు. విష్ణు, మ‌నోజ్‌ల‌తో ఆయ‌న మాట్లాడిన‌ట్టు, ఇక మీద‌ట ఎలాంటి ర‌చ్చ చేయ‌కుండా ఇద్ద‌రికీ న‌చ్చ చెప్పిన‌ట్టు టాక్‌. ఈ గొడ‌వ‌లు ఇక్క‌డితే ఆగిపోతే సంతోష‌మే. ఇంకాస్త ముదిరితే.. ఆ మిగిలిన వీడియోలు సైతం బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : బ్యాన్ చేసి ఏబీఎన్‌ క్రేజ్ పెంచేసిన జగన్ !

ఏబీఎన్ చానల్ కు జగన్ ఎంత మేలు చేశారంటే.. ఇప్పుడా చానల్ యూ ట్యూబ్ లో జాతీయ.స్థాయిలో నాలుగో స్థానంలో ఉంది. ఏపీలో ఆ చానల్ రాకుండా చేశారు. డిష్‌లలో వస్తుంది. కానీ...

లిక్కర్ స్కాంలో కవితపై ఆధారాలున్నాయన్న కోర్టు !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు అనూహ్యమైన షాక్ తగిలింది. నేరుగా కోర్టే ప్రాథమిక అదారాలు ఉన్నాయని వ్యాక్యానించింది. ఇప్పటి వరకూ ఈడీ, సీబీఐ ఆరోపణలు చేసింది. కానీ న్యాయమూర్తి ఆధారాలున్నాయని...

వారాహియాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్న జనసేన !

ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. పద్నాలుగో తేదీన వారాహి యాత్రను ప్రారంభిస్తున్నారు. రెండు రోజుల ముందే అమరావతి చేరుకుని హోమాలు చేయనున్నారు. ఆ...

గుడివాడ టిడ్కో ఇళ్లు -పరువు పోగొట్టుకున్న కొడాలి నాని !

గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించారు. వాటిని లబ్దిదారులకు కేటాయించారు. చివరికి రోడ్లు, కరెంట్ వంటి సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు హ్యాండోవర్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close