[X] Close
[X] Close
జగన్ సవాళ్ళకు మున్సిపల్ ఎన్నికలే సమాధానమా!

శాసన సభా నియోజక వర్గాల సైజులో వున్న పదకొండు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి తెలుగుదేశం హోమ్ వర్కు మొదలు పెట్టింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి చేర్చేసుకుంటున్న నేపధ్యంలో దమ్ముంటే ఆఎమ్మెల్యేలను అనర్హులిగా చేసి ఉపఎన్నికలు నిర్వహించాలన్న సవాలు పై తెలుగుదేశం ఈ ఆలోచన చేస్తోంది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఓడిపోతారనే భయంతోనే అధికార పార్టీ ఉప ఎన్నికలకు వెనకడుగు వేస్తోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ప్రతిపక్షం నోరు మూయించడానికి లోకల్‌ బాడీ ఎలక్షన్లను వేదిక చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది.

విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు తిరుపతి కార్పొరేషన్లకు.. శ్రీకాకుళం, రాజాం, నెల్లిమర్ల, కందుకూరు, రాజంపేట మున్సిపాలిటీలకు వివిధ కారణాలతో ఎన్నికలు జరగలేదు… వీటిల్లో కొన్నిటిపై కోర్టు స్టేలు ఉంటే… మిగిలిన చోట్ల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఇప్పుడా ఈ అడ్డంకులన్నీ క్లియర్ చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల పదవులకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించి గెలిచి జగన్ సవాళ్ళకు సమాధానం ఇవ్వాలన్నది తెలుగుదేశం ఆలోచన. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలు తమవెంటే వున్నారని, ప్రజాభిప్రాయం మేరకే ఆపార్టీ ఎమ్మెల్లేలు తమ పార్టీలో చేరిపోతున్నారని నిరూపించడానికి మున్సిపాలిటీలను వేదిక చేసుకోవాలన్నది అధికారపార్టీ వ్యూహం.

ఇప్పటికే 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి మారిపోయారు. మరో వారం రోజుల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేస్తున్నారు.గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మేయర్, ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలే జరిగేవి. వైఎస్ఆర్ హయాంలో పరోక్ష ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం ఇపుడు తన సొంత విధానమైన ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళాలని భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మం

సినీ న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆయ‌న కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయ‌న కోమాలోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని య‌శోదా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న...

కోమటి జయరాం కి మాతృ వియోగం, పలువురి సంతాపం

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, కోమటి జయరాం తల్లి కోమటి కమలమ్మ ఏప్రిల్ 9, గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం) 2:15లకు కన్నుమూశారు....

పేదలకు ప్యాకేజీ ప్రకటించాలని టీడీపీ డిమాండ్..!

పేదలందరికి కుటుంబానికి రూ. ఐదు వేలు చొప్పున పంపిణీ చేయాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు చేసినా పట్టించుకోవడం లేదని మండి పడింది.రాష్ట్రంలో ప్రస్తుత...

లారెన్స్ విరాళం 3 కోట్లు

డాన్సర్ గా, నటుడిగా, దర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నాడు లారెన్స్‌. ప్ర‌జా సేవ‌లోనూ ముందుంటాడు. ఓ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స్థాపించి విక‌లాంగుల‌కు స‌హాయం చేస్తున్నాడు. ఇప్పుడు కరోనాపై పోరాటంలో త‌న...

HOT NEWS