ఈ సంకేతాలపై పాపం! జగన్‌ అలర్ట్‌ అయ్యారో లేదో?

అటువైపు ఎప్పటికైనా తాను ముఖ్యమంత్రి పీఠం అధిష్టించవలసి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తన బలం అనుకుంటున్న ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా తెదేపాలో చేరిపోతున్నారు. తెలంగాణలో తన పార్టీ ఉనికి మీద జగన్‌కు ఏమాత్రం శ్రద్ధ లేకపోయినప్పటికీ.. పోయినోళ్లు పోగా, నామమాత్రంగా కొందరు నాయకులున్నారు గనుక.. దాన్ని కూడా పార్టీలాగా కొనసాగిస్తున్నారు. కాకపోతే.. తాజాగా తెలంగాణ వైకాపా అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నారంటూ కొత్త పుకార్లు వినిపిస్తున్నాయి. జగన్‌ నివాసంలోనే జరిగిన పార్టీ సమావేశంలో శ్రేణులంతా ఆయనను ఇదే విషయమై నిలదీస్తే.. ఆయన సూటిగా ఏ సమాధానమూ చెప్పకపోవడం మరింత విశేషం. ఇంతా కలిపి… ఏకంగా పార్టీ అధ్యక్షుడే తెరాసలోకి ఫిరాయించే పరిస్థితి గురించి జగన్‌ దృష్టిసారించాడా లేదా అనే చర్చ ఇప్పుడు పార్టీలో నడుస్తోంది.

పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు జగన్‌ చాలా హడావిడి చేశారు. ఆయనను గెలిపించండి చాలు.. ఆయనను కేంద్రమంత్రిగా చేసే బాధ్యత నాది అంటూ ఖమ్మం ప్రజలకు బోలెడు హామీలిచ్చారు. బహుశా తన మద్దతు లేకుండా కేంద్రంలో కొత్త సర్కారు రాదని ఆరోజున ఆయన అనుకని ఉండవచ్చు. కానీ ఫలితాలు వచ్చేసరికి తెలంగాణలో వైకాపాకు ఖమ్మం మినహా ఠికానా లేకుండా పోయింది. అదే పొంగులేటి సుధాకరరెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడుగా చేశారు జగన్‌. ఆయన ఏదో అప్పుడప్పుడూ సమావేశాలు పెట్టుకుంటూ.. ఢిల్లీలో తెరాస ఎంపీలతో కలిసిమెలిసి తిరుగుతూ, పార్లమెంటులో జగన్‌ డిమాండ్‌లు కాకుండా, తెరాస అనుకూల డిమాండ్‌లకు జైకొడుతూ.. ఏదోక రీతిగా రోజులు నెట్టుకొస్తున్నారు.

తాజాగా ఏప్రిల్‌ నెలలో పొంగులేటి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర పార్టీ సమావేశంలో కార్యకర్తలు ఇదే విషయం నిలదీస్తే ఆయన కనీసం ఖండించలేదు. వెళ్లదలచుకుంటే చెప్పే వెళ్తా.. ఎప్పుడో వెళ్లి ఉంటే ఈపాటికి మంత్రి అయ్యేవాడిని లాంటి డొంకతిరుగుడు డైలాగులు చెప్పారే తప్ప.. వెళ్తున్నట్టా లేదా? అనేది వెల్లడించలేదు. జగన్‌ స్వయంగా చొరవ తీసుకుని.. పొంగులేటితోమాట్లాడి బుజ్జగిస్తే మాత్రమే. ఈ రాష్ట్రంలో వైకాపా కు కనీసం ఉన్న అస్తిత్వం కాపాడినట్టు అవుతుంది. ఆ పనిచేయకుండా, పోయేవాళ్లతో మాట్లాడడమూ నీకు నచ్చదు.. అంటూ జగన్‌ తన సహజ మార్కు ధోరణి ప్రదర్శిస్తే.. తెలంగాణలో పార్టీ దుకాన్‌ బంద్‌ కావడం తథ్యం!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close