ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. మండలి ఛైర్మన్ అనర్హతా వేటు ప్రక్రియ ప్రారంభించారు. విప్‌ను ధిక్కరించినందుకు అనర్హత వేటు ఎందుకు వేయరాదో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు పంపారు. జూన్‌ 3 మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని ఆదేశించారు. ఆ తర్వాత ఎప్పుడైనా వారిపై అనర్హతా వేటు పడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం మండలిలో టీడీపీకే మెజార్టీ ఉంది. మండలి చైర్మన్ .. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కావడం లేదు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంతో.. ఆయన ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపైనా నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే విలువ ప్రకారం.. పార్టీ మారే వారిపై తక్షణం వేటు వేయాల్సి ఉంటుంది. అలా వేటు వేయడం ఇష్టం లేక.. ఆయన నేరుగా పార్టీలో చేర్చుకోకుండా మద్దతుదారులుగా మార్చుకుంటున్నారు. కానీ ఎమ్మెల్సీ విషయంలో వారు విప్ ధిక్కరించి దొరికిపోయారు. దాంతో.. పదవులు ఊడటం ఖాయంగా కనిపిస్తోంది.

శాసనమండలిని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ప్రస్తుతం ఆ తీర్మానం బిల్లుగా మారి ఆమోదం పొందడానికి అనువైన పరిస్థితులు లేవు. ఈ లోపు.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే.. ఖచ్చితంగా మండలిని కూడా సమావేశపర్చాల్సి ఉంటుంది. దీని వల్ల.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు పడటం వల్ల.. వైసీపీకి ఎలాంటి అదనం ప్రయోజనం కలిగే పరిస్థితి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close