బీజేపీ గవర్నరేగా సంతకం పెట్టింది..! ఎలా స్వాగతిస్తున్నారు..?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని..హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా.. పోటీలు పడి స్వాగతించారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావు దగ్గర నుంచి అనంతపురంలోని విష్ణువర్ధన్ రెడ్డి వరకూ అందరూ ప్రభుత్వానికి చెంపపెట్టు అనే విమర్శు చేశారు. అంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ అత్యంత వివాదాస్పద నిర్ణయం.. ఏపీ సర్కార్ తీసుకోవడానికి వెనుక ఉన్నది బీజేపీ దన్నేనని చాలా మంది అనుమానం. ఎన్నికల సంఘం అధికార పరిధుల్లోకి ప్రభుత్వాలు చొచ్చుకురాకుండా… రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. ఆ విషయంలో తిరుగులేని తీర్పులు ఉన్నాయి.

అయినప్పటికీ.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. తన వద్దకు ఫైల్ వచ్చిన గంటల‌్లోనే క్లియర్ చేశారు. అత్యంత రహస్యంగా జరిగినప్రక్రియకు తన వంతు సాయం చేశారు. ఆర్డినెన్స్‌కు మాత్రమే కాదు.. ఎస్‌ఈసీ నియామకానికి కూడా ఆయన శరవేగంగా ఆమోదం తెలిపారు. ఆయన సంతకాలు పెట్టిన విషయం.. మొత్తం వ్యవహారం బయటకు వచ్చిన తర్వాతనే తెలిసింది. ఆ వేగం.. ఆ సీక్రెసీని బట్టి చూస్తే.. ఢిల్లీ అండ ఉంటేనే ఏపీ సర్కార్ ఇంత సాహసం చేస్తుందని ఎవరైనా నమ్ముతారు. అందుకే.. గవర్నర్ హరిచందన్ కూడా.. కళ్లు మూసుకుని సంతకాలు పెట్టారని భావించారు.

కానీ ఇప్పుడు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రాగానే బీజేపీ నేతలు.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు. ఇదే డబుల్ గేమ్ ఏమో అన్న చర్చ.. ఇప్పుడు ప్రారంభమయింది. ఏపీ సర్కార్ చేస్తున్న ప్రతీ ప్రయత్నానికి బీజేపీ మద్దతు ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారు. చట్ట, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను.. ఢిల్లీ స్థాయిలో అడ్డుకునే అవకాశం ఉన్నప్పటికీ కోర్టుల్లో వీగిపోయిన తర్వాతనే.. తాము వాటిని వ్యతిరేకించినట్లుగా ప్రకటనలు చేయడం.. రాజకీయంలో భాగం ఏమో అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close