బెజవాడలో టీడీపీ వర్సెస్ టీడీపీ గ్రూప్ తగాదాలు

విజయవాడలో టీడీపీ నాయకులు .. ఎన్నికలకు ముందే ఆ పార్టీని ఓడగొడుతున్నారు. అధికార పార్టీ దూకుడుని తట్టుకుని ఎంతో కొంత గెలుపు చాన్స్ ఉందని అనుకుంటున్న బెజవాడ నేతలు.. పోలింగ్ కు నాలుగు రోజుల ముందు రోడ్డున పడ్డారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ప్రెస్ మీట్ పెట్టి.. కేశినేని నానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీనికి కారణం.. చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని విజయవాడలో చేయబోతున్నారు. ఆయన రూట్ మ్యాప్ హఠాత్తుగా మారింది. ఇలా మార్పించింది కేశినేని నానినే అని బుద్దా వెంకన్న, బొండా ఉమ రగిలిపోయారు. వెంటనే… బోండా ఉమా ఇంట్లో బుద్దా వెంకన్న, నాగుల్‌మీరా సమావేశం అయ్యారు. కేశినేని కావాలా..అందరూ కావాలా..చంద్రబాబు తేల్చుకోవాలని బోండా ఉమ అల్టిమేటం జారీ చేశారు. అంతే కాదు. చంద్రబాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే మేము పాల్గొనబోమని కేశినేని వ్యతిరేక వర్గంగా పేరు పడిన వారంతా తేల్చేశారు.

ఎంపీ కేశినేనేనిపై వెంకన్న, ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీని కేశినేని సొంత జాగీరుగా వాడుకుంటున్నారని.. కుల సంఘంగా మారుస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మా అధినేత.. కేశినేని నాని మా హైకమాండ్ కాదన్నారు. కొద్ది రోజుల కిందట.. విజయవాడకు తానే హైకమాండ్‌ను అని కేశినేని చేసిన వ్యాఖ్యలకు వీరు కౌంటర్ ఇచ్చారు. పార్టీ కోసం మా పోరాటం..పదవుల కోసం కేశినేని నాని ఆరాటమని.. వైసీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. విజయసాయిరెడ్డిని లంచ్‌కు పిలిచారన్నారు. కేశినేని నానిలా చీకటి రాజకీయాలు చేసే నైజం మాది కాదన్నారు. విజయవాడలో రెండు నియోజకవర్గాల్లో బుద్దా వెంకన్న, బొండా ఉమ బలమైన నేతలు కావడంతో.. కార్పొరేషన్ ఎన్నికల్లో వారి సహకారంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి.

ఈ వివాదం ఒక్క సారిగా మీడియాలో సంచలనం సృష్టించడంతో… చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకున్నారు. టెలికాన్ఫరెన్స్‌లో అందరితో మాట్లాడారు. అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్‌, వర్ల రామయ్య విజయవాడ నేతలందరితో మాట్లాడారు. విబేధాలను పక్కనపెట్టి కలిసి పనిచేస్తామని.. శ్వేతను వెంట పెట్టుకుని ప్రచారానికి వెళ్తామని చంద్రబాబుకు చెప్పారు. చంద్రబాబు రోడ్ షోలో కేశినేని నాని పాల్గొన్నా.. తాము కూడా పాల్గొంటామని చెప్పుకొచ్చారు. తనకు వ్యతిరేకంగా బుద్దా వెంకన్న, బొండా ఉమ చేసిన వ్యాఖ్యలపై కేశినేని కూల్‌గా స్పందించారు. చంద్రబాబు చెబితే తక్షణమే రాజీనామా చేస్తానని.. రూట్ మ్యాప్ మార్పులో తన ప్రమేయం ఏమీ లేదన్నారు.

విజయవాడ టీడీపీ నేతలు ఇప్పుడు.. తమలో తాము పోటీ పడటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వైసీపీ గురించి ఎక్కువగా చర్చించలేకపోతున్నారు. వైసీపీ నేతలు ఇదే అదనుగా.. టీడీపీలో వర్గపోరును హైలెట్ చేస్తున్నారు. వారిని గెలిస్తే.. ఎలా అభివృద్ది చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన అంశాలను.. టీడీపీ నేతలు మీడియాకు ఎక్కి రచ్చ చేసుకుంటున్నారు. అభ్యర్థులను మార్చాలనుకున్న కేశినేని.. దాన్ని .. చేయాల్సిన పద్దతిలో చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు.. తానే హైకమాండ్‌ను అని ప్రకటించుకుని ఇష్టం వచ్చినట్లుగా చేసుకున్నారు. దాంతో తాము కూడా ప్రముఖ నాయకులమేననుకుంటున్న ఇతర నేతల అహం దెబ్బతిన్నది. అతి అంతకంతకూ పెరిగి.. చివరికి టీడీపీని వర్గ పోరాటానికి కేంద్రంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close