లక్ష కోట్ల జగన్ ఆరోపణలపై తెదేపా సీరియస్

తెదేపా ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో రూ.1.30 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెదేపా నేతలందరూ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, మంత్రులు, పార్టీ నేతలు అందరూ దీనిపై స్పందించడం గమనిస్తే ఆ సంగతి అర్ధమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపనలన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకొని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేకుంటే, జగన్ పై చట్టపరంగా చర్యలు చేపడతామని పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ కె.రవీంద్ర కుమార్ హెచ్చరించారు. రాజకీయ దుర్దేశ్యంతోనే జగన్ నిరాధారమయిన ఆరోపణలు చేస్తున్నారని, ఆయన అక్రమంగా సంపాదించిన లక్ష కోట్లకి వడ్డీని కలుపుకొని రూ.1.30 లక్షల కోట్ల సంఖ్యని తయారు చేసి చెపుతున్నట్లుందని ఎద్దేవా చేసారు. ఒక అబద్ధాన్ని వందసార్లు గట్టిగా ప్రచారం చేస్తే నిజం అవుతుందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లున్నారని రవీంద్ర విమర్శించారు.

అయితే జగన్మోహన్ రెడ్డి తన ఆరోపణలను ఆధారాలతో సహా పుస్తక రూపంలో ప్రచురించి, కేంద్ర మంత్రులకి, కేంద్రప్రభుత్వంలో వివిధ శాఖల ఉన్నతాధికారులకి కూడా పంచిపెడతానని చెపుతున్నప్పుడు, ఆయన దానిని ఉపసంహరించుకొని తెదేపాకు క్షమాపణలు చెప్పమని రవీంద్ర డిమాండ్ చేయడం చాలా అసంబద్దంగా ఉంది. జగన్ తన ఆరోపణలకు కట్టుబడి ఉన్నప్పుడు, తెదేపా నేతలు ఇంకా ఇటువంటి హెచ్చరికలతో కాలక్షేపం చేయడం అంటే ఆ ఆరోపణలని వారు ఎంతో కొంత మేర అంగీకరిస్తున్నట్లే అవుతుంది. అయినా ఇప్పుడు రవీంద్రతో సహా తెదేపా నేతలు అందరూ జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల అక్రమాస్తులు కూడా బెట్టారని నిత్యం విమర్శిస్తున్నప్పుడు, ఆయన తిరిగి అవే విమర్శలు చేస్తే తెదేపా ఉలికిపడటం చాలా విచిత్రంగానే ఉంది. ఒకవేళ తెదేపా నేతలకు ఆ ఆరోపణలు ఆమోదయోగ్యం కానట్లయితే, ఈవిధంగా తాటాకు చప్పుళ్ళు చేయడం మాని, తక్షణం ఆ ఆరోపణలపై న్యాయస్థానంలో సవాలు చేయడమో లేకపోతే సిబీఐ విచారణకు ఆదేశించో తమ నిజాయితీని నిరూపించుకొంటే బాగుంటుంది కదా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

చిరంజీవి ని కలవడం పై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఈరోజు అధికారికంగా పగ్గాలు చేపట్టారు సోము వీర్రాజు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూండగా, ఇటీవల చిరంజీవిని...

జగన్ “స్టే” ఆశల్ని వమ్ము చేసిన తప్పుల పిటిషన్..!

మూడు రాజధానుల బిల్లుల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై స్టే తెచ్చుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కాలం కలసి రావట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.....

మాకు మహానగరాల్లేవ్.. సాయం చేయండి : జగన్

కేంద్రం నుంచి సాయం పొందాలంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విజ్ఞప్తులు కాస్త భిన్నంగా ఉంటాయి. కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతున్న పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో...

HOT NEWS

[X] Close
[X] Close