ఉత్తుత్తి సవాళ్ల రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల నేతల సవాళ్లు అసువుగా చేసేసుకుంటున్నారు. కానీ ఒకరి సవాల్‌కు ఒకరు అంగీకరించారు. ఎవరి సవాల్ వారిదే. మా సవాల్ స్వీకరించాలంటే మా సవాల్ స్వీకరించాలని రెండు వైపుల నేతలు ప్రెస్‌మీట్లు పెట్టి జర్నలిస్టుల బ్రెయిన్ వాష్ చేస్తూంటారు. అంతిమంగా రెండు పార్టీల నేతల సవాళ్లదీ ఒకటే టార్గెట్.. అదే రాజీనామాలు చేయడం. అదే అసలు విషయం అయినప్పుడు అంశం ఏదయితేనేం… వెంటనే… ఏదో ఓ టాపిక్ మీద.. సవాల్‌ను ఆమోదింప చేసుకుని ఆ తర్వాత రంగంలోకి దిగితే.. రాజకీయంలో తాడేపేడో తేల్చుకున్నట్లు అవుతుంది కదా..! కానీ అలా తేల్చేసుకునే ఉద్దేశం రెండు పార్టీలకు లేదు. అందుకే సవాళ్ల పేరుతో రాజకీయ పండుగ చేసుకుంటున్నారు.

తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ గెలిస్తే.. వైసీపీ ఎంపీలందరూ రాజీనామా చేస్తారని.. టీడీపీ ఓడిపోతే ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ చేశారు. తిరుపతి ఉపఎన్నిక వేదికగా ప్రభుత్వ పాలనపై అభిప్రాయం చెప్పాలని చంద్రబాబు తనప్రచార ప్రసంగాల్లో కోరుతూండటంతో పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. రాజధాని మార్పు ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలని గతంలో చంద్రబాబు ఇచ్చిన సవాల్‌ను ఆమోదించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అప్పట్లో చంద్రబాబు రాజధాని మార్పు అంశంపై అధికార పార్టీకి అదేపనిగా సవాళ్లు చేశారు. మూడు రాజధానులపై .. రిఫరెండంగా ఎన్నికలకు వెళ్దామని… ఒక వేళ వైసీపీ గెలిస్తే.. టీడీపీని మూసేసుకుంటామని ఆఫర్ ఇచ్చారు. కానీ వైసీపీ వైపు నుంచి స్పందన లేదు.

ఆ తర్వాత టీడీపీ ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీల రాజీనామాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఏప్రిల్ ఆరో తేదీన రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసింది. దానికికారణం ఉంది. గతంలో జగన్ ఏప్రిల్ ఆరో తేదీనే తమ ఎంపీలు రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ వీడియోను వైరల్ చేస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని సవాల్ చేశారు. తమ ఎంపీలుకూడా రాజీనామాలు చేస్తానన్నారు. కానీ వైసీపీ నుంచి ప్రతిస్పందన లేదు. కానీ…తిరుపతి ఉపఎన్నిక విషయం వచ్చే సరికి… మంత్రిపెద్దిరెడ్డికి సవాల్ చేయాలని అనిపించింది. వెంటనే… మీడియా ముందుకు వచ్చి సవాల్ చేశారు.

రాజధానుల అంశంపై, ప్రత్యేకహోదా అంశంపై సవాళ్లకు స్పందించని వైసీపీ… ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలకు సంబంధించి మాత్రం ఆసక్తిగా సవాల్ చేసింది. ఇదే అదనుగా ఇతర పార్టీల నేతలు.. రాజకీయం కోసం కాదు.. రాష్ట్రం కోసం రాజీనామాలు చేద్దామంటూ కౌంటర్లు ప్రారంభించారు. మొత్తానికి ఏపీలో ఎవరికీ… రాష్ట్రం కోసం.. రాజకీయం చేసే ఉద్దేశం లేదు. ప్రజల్ని మభ్యపెట్టే సవాళ్లతో రాజకీయం చేస్తున్నారు. ఎవరూ నేరుగా రంగంలోకి దిగడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులు కొట్టారని RRR ఫిర్యాదు, పోలీసుల పై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి సర్కార్ అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు మొదలుకొని సామాజిక వర్గ...

ఆహా కోసం రెండు క‌థ‌లు సిద్ధం చేసిన మారుతి

మెగా కుటుంబంతో మారుతికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అల్లు శిరీష్ తో త‌ప్ప‌.. మెగా హీరోలెవ‌రితోనూ సినిమాలు చేయ‌క‌పోయినా మంచి రాపో ఏర్ప‌డింది. అల్లు అర్జున్ కి మారుతి చాలా క్లోజ్‌. అల్లు...

టెన్త్ పరీక్షలు నిర్వహిస్తాం : ఏపీ సర్కార్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లోకేష్ రాసిన లేఖపై ఏపీ విద్యా మంత్రి సురేష్ పరోక్షంగా స్పందించారు. పరీక్షలు జరిగితీరుతాయని విద్యార్థులు ప్రిపేర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. షెడ్యూల్...

పవన్ సరే ఆ బాధ్యత అధికార పార్టీకి లేదా..!?

రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది కరెక్ట్ సమయం కాదని .. ముందు కోవిడ్ రోగుల గురించి పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. పవన్ కల్యాణ్ లేఖపై వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close