హనుమాన్ జన్మస్థలాన్ని టీటీడీ వివాదం చేస్తోందా..!?

హనుమంతుని జన్మస్థానం తిరుమలేనని… అంజనాద్రే ఆంజనేయుడు పుట్టిన ప్రాంతమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అంతే కాదు చారిత్రక ఆధారాలున్నాయని వాటిని ఉగాది నాడు ప్రకటిస్తామని కొద్ది రోజుల కిందట ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ ప్రకటన వాయిదా వేసుకున్నారు. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెబుతోంది. ఇప్పటికే టీటీడీ పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి ..పరిశోధనచేసి.. హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని నిర్ధారించింది. అయితే… టీటీడీ ప్రకటనపై ఇప్పటికే వివాదం బయలుదేరింది.

కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ నేతలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హంపి ఆంజనేయుని పుట్టుక ప్రాంతం అనేందుకు ఆధారాలు ఉన్నాయని వారు ప్రకటను చేస్తున్నారు. టీటీడీ తొందరపడకుండా, నిపుణులను చరిత్రకారులను సంప్రదించిన తర్వాతే ప్రకటించాలని వారు హితవు పలుకుతున్నారు. వీరి అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రకటన చేస్తే.. తిరుమలను వివాదాల్లోకి లాగినట్లవుతుందన్న ఉద్దేశంతో టీటీడీ శ్రీరామనవమికి ప్రకటనను వాయిదా వేసినట్లుగా కనిపిస్తోంది. ఒక్క ప్రకటన మాత్రమే కాదని.. ఆధారాలను కూడా చూపిస్తామని టీటీడీ చెబుతోంది.

హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించారని టీటీడీ చెబుతోంది. శివ‌, బ్రహ్మ, బ్రహ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం గ్రంథం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్‌సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి చెంత గ‌ల అంజ‌నాద్రి కొండే ఆంజ‌నేయుని జ‌న్మస్థాన‌మ‌ని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు. దీన్ని పుస‌్తక రూపంలో తీసుకు వస్తామని కూడా చెబుతోంది. వివాదం అయ్యే అవకాశం ఉందని తెలిసి కూడా టీటీడీ … ఎందుకు ప్రకటనపై ఇంత ఉత్సాహం చూపిస్తుందో పలువురికి అర్థం కావడం లేదు. ఇంత సున్నితమైన అంశాన్ని దేశవ్యాప్త నిపుణుల ఏకాభిప్రాయంతో ప్రకటించినప్పుడే తిరుమలపై వివాదాలు రేగకుండా ఉంటాయని కొంత మంది సూచిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close