అల‌మేలు కోసం పోటీ: కీర్తి Vs స్వీటీ

తేజ కొత్త సినిమా `అల‌మేలు మంగ – వేంక‌ట‌ర‌మ‌ణ‌` కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఈమ‌ధ్యే వ‌చ్చింది. వేంక‌ట ర‌మ‌ణ‌గా గోపీచంద్ ఫిక్స‌య్యాడు. ఇప్పుడు అల‌మేలు మంగ కోసం అన్వేష‌ణ మొద‌లైంది. ఈ పాత్ర కోసం ముందు కాజ‌ల్ ని అనుకున్నారు. మ‌రి ఇంత‌లోనే ఏమ‌య్యిందో… కాజ‌ల్‌ని తేజ ప‌క్క‌న పెట్టేశాడు. ఆ స్థానంలో మ‌రో అగ్ర క‌థానాయిక కోసం వేట మొద‌లైంది. ఈ పాత్ర కోసం ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కొంది. అయితే కీర్తి సురేష్‌, లేదంటే అనుష్క‌తో అల‌మేలు పాత్ర చేయించాల‌ని చూస్తున్నాడు తేజ‌. ప్ర‌స్తుతానికైతే కీర్తి సురేష్‌తో సంప్ర‌దింపులు మొద‌ల‌య్యాయి. తేజ‌తో ప‌నిచేయ‌డానికి కీర్తి ఆస‌క్తి చూపిస్తోంద‌ని, అయితే కాల్షీట్ల వ్య‌వ‌హార‌మే ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని తెలుస్తోంది. గోపీచంద్ ప్ర‌స్తుతం `సిటీమార్‌`తో బిజీగా ఉన్నాడు దాని త‌ర‌వాతే తేజ సినిమా మొద‌లౌతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close