అఫీషియ‌ల్: ప్ర‌భాస్ తో నాగ అశ్విన్‌

మ‌హాన‌టి లాంటి క్లాసిక్ త‌ర‌వాత నాగ అశ్విన్ నుంచి మ‌రో సినిమా ఏదీ రాలేదు. ఆయ‌న క‌థ‌ల అన్వేష‌ణ‌లో బిజీగా ఉన్నారు. అశ్విన్ నుంచి ఎలాంటి సినిమా వ‌స్తుంది? ఏ హీరోతో చేస్తారు? అనే ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డిచింది. చాలామంది హీరోల పేర్లు ప‌రిశీల‌న‌కు వ‌చ్చాయి. అయితే చివ‌రికి అనూహ్యంగా ప్ర‌భాస్ తో సినిమా ఓకే అయ్యింది. ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ సంస్థ నిర్మించ‌నుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. కొన్ని రోజులుగా ప్ర‌భాస్ – వైజ‌యంతీ మూవీస్ – నాగ అశ్విన్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అవ‌న్నీ ఓ కొలిక్కి రావ‌డంతో ఈ సినిమా ఖ‌రారైపోయింది. ఈ యేడాదే ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com