తేజ – కాజ‌ల్‌… వ‌న్స్ మోర్ ప్లీజ్‌!!

తేజ – కాజ‌ల్… ఈ బంధం ఇంకా ఇంకా బ‌ల‌ప‌డుతూనే ఉంది. కాజ‌ల్‌కి తొలి ఛాన్స్ ఇచ్చింది తేజానే. ల‌క్ష్మీ క‌ల్యాణంతో కాజ‌ల్ ఎంట్రీ ఇచ్చింది. నేనే రాజు నేనే మంత్రి తో వీరిద్ద‌రి ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్ ప‌డింది. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి `సీత‌`తో ఇద్ద‌రూ ముందుకొస్తున్నారు. సీత త‌ర‌వాత మ‌రోసారి వీరిద్ద‌రూ క ల‌సి ప‌నిచేయ‌బోతున్న‌ట్టు టాక్‌. ఈసారి లేడీ ఓరియెంటెడ్ క‌థ‌తో త‌యార‌వుతున్నాడ‌ట తేజ‌. థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సాగే ఓ క‌థ‌ని కాజ‌ల్ కోసం తేజ సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. నిర్మాత‌లు కూడా రెడీగానే ఉన్నార్ట‌. `సీత‌`కు వ‌చ్చిన స్పంద‌న బ‌ట్టి.. వెంట‌నే ఈ కాంబోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలా? లేదంటే ఇంకొన్ని రోజులు ఆగాక మొద‌లెట్టాలా? అనేది ఆలోచిస్తార‌ట‌. `సీత` హిట్ట‌యితే ఈ కాంబినేష‌న్‌కి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆ ఉత్సాహంలో సినిమాని మొద‌లెడితే బిజినెస్‌ప‌రంగానూ ప్ల‌స్ అవుతుంది. `సీత‌` విడుద‌ల త‌ర‌వాతే.. ఈ సినిమాపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com