మీడియాకు లీకులు..! రవిప్రకాష్‌కు ఇదో రకం బెదిరింపులు..!

రవిప్రకాష్, శివాజీ మధ్య టీవీ9 వాటాల అమ్మకాలు, కొనుగోలు ఒప్పందం .. స్కాం అంటూ… కొత్త ప్రచారాన్ని.. అనుకూల మీడియా ద్వారా.. కొంత మంది ప్రారంభించారు. అసలు రవిప్రకాష్ షేర్లు శివాజీకి అమ్ముకోవాలనుకున్నారు. దీనికి ఎవరి పర్మిష‌న్ అక్కర్లేదు. అమ్ముకున్నారు. వారి మధ్య ఏదో గొడవ వచ్చింది. అది తేల్చుకుంటున్నారు. అది వారిద్దరి మధ్య వివాదం.. ఈ విషయంపై రవిప్రరకాష్ కానీ.. శివాజీ కానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. శివాజీ.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వెళ్లారు. అక్కడ విచారణ జరుగుతోంది. అంటే.. ఇది పోలీసులకు సంబంధం లేని వ్యవహారం. కానీ.. టీవీ9 ఆఫీసు నుంచి.. పోలీసులు తీసుకెళ్లిన కంప్యూట్రల నుంచి కీలకమైన ఈమెయిల్స్ బయటకు తీశారని.. అవి తమ దగ్గర ఉన్నాయని మీడియా సంస్థలు బ్రేకింగులు వేయడం ప్రారంభించాయి.

శివాజీ… రవిప్రకాష్ మధ్య షేర్ల బదిలీ ఒప్పందం… గత ఏడాది ఫిబ్రవరిలో జరగలేదని… ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జరిగిందని… పోలీసులు రవిప్రకాష్ కంప్యూటర్ల నుంచి తవ్వకాలు జరిపి.. బయటకు తీసిన వాటిలో ఉందని… మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆ మెయిల్స్ ను వారు డిలీట్ చేస్తే…పోలీసులు రీట్రివ్ చేశామని చెబుతున్నారు. రీట్రీవ్ చేశారో.. లేక .. కొత్తగా ప్లాంట్ చేసి.. అదే నిజమని నమ్మించాలనుకుంటున్నారో కానీ… ముందుగా.. మీడియాకు మాత్రం లీక్ చేసేశారు. మీడియా సంస్థలు చేసుకుంటున్న ప్రకటనలు చూస్తే… ఆ మెయిల్స్ కాపీలు ముందుగా ఆయా సంస్థలకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

రవిప్రకాష్, శివాజీల మధ్య జరిగిన ఒప్పందంలో ఎలాంటి స్కాం ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. లావాదేవీ ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి… వారే ఫిర్యాదు చేయాలి. శివాజీ ఆ ఫిర్యాదు ఎన్సీఎల్టీలో చేశారు. ఈ మధ్యే చేసుకున్నారా..? లేదా.. ఎప్పుడో చేసుకుని ఇప్పుడు చేసుకున్నట్లు చెబుతున్నారా.. ? అలా చెబితే.. అలా చెప్పడానికి కారణాలేమిటి..? అన్నదానిపై ఎన్సీఎల్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో టీవీ9 కొత్త యాజమాన్యానికి కూడా సంబంధం ఉండకపోవచ్చు. అయినప్పటికీ.. మీడియాకు ఇస్తున్న లీకులు.. రవిప్రకాష్ ఏదో చేశాడని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నమని.. ఆయన క్యాంప్ భావిస్తోంది.

రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగినప్పుడు.. ఆయనను మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంచారు. బయట ఏమి జరుగుతుందో తెలియకుండా.. ఆయనపై విపరీతంగా ఓ కరకమైన ప్రచారం చేశారు. మూడు రోజుల పాటు.. రేవంత్ రెడ్డికి వేల కోట్లు ఆస్తులున్నాయని.. కొన్ని దొంగ డాక్యుమెంట్లను కూడా మీడియా ప్రచారంలోకి పెట్టింది. ఇందులో టీవీ9 కూడా ఉంది. ఇదంతా.. టీవీ9 కొత్త యాజమాన్యం చేసిందనేని.. రవిప్రకాష్ ఓ ఇంటర్యూలో చెప్పినట్లుగా… తెలుస్తోంది. అదే పద్దతిని ఇప్పుడు రవిప్రకాష్ పై కూడా ఫాలో అవుతున్నారు. ముందుగా.. నిజమో కాదో కానీ.. కొన్ని లీకులు మాత్రం.. మీడియాకు వెళ్లిపోతున్నాయి. ముందు ముందు.. తీసుకెళ్లిన కంప్యూటర్లలో ఏదైనా వ్యక్తిగత సమాచారం ఉంటే.. అది కూడా బయటకు రావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close