గోపీచంద్‌కి తేజ అభ‌యం

గోపీచంద్‌కి ఏదీ క‌ల‌సి రావ‌డం లేదు. చేసిన సినిమాలు ఆగిపోతున్నాయి. వ‌చ్చిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చేయాల్సిన సినిమాలు జారిపోతున్నాయి. గోపీచంద్ మార్కెట్ ఎప్పుడో చిన్నాభిన్నం అయ్యింది. ఇప్పుడు గోపీచంద్ తో సినిమా అంటే నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఇటీవ‌లే గోపీచంద్ చేతులోంచి ఓ సినిమా జారిపోయింది. సంప‌త్ నందితో ఓ సినిమా ప‌ట్టాలెక్కాల్సివుంది. అది సెట్స్‌పైకి వెళ్లేంత వ‌ర‌కూ సినిమా ఉంటుందో లేదో కూడా తెలీదు.

ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో గోపీచంద్‌కి తేజ నుంచి అభ‌యం వ‌చ్చింది. గోపీచంద్ కోసం తేజ ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. నిర్మాత కూడా రెడీగా ఉన్నాడ‌ట‌. గోపీచంద్ ఓకే అంటే.. ఈ కాంబో ప‌ట్టాలెక్క‌డం ఖాయం అనిపిస్తోంది. నిజంతో గోపీచంద్‌ని విల‌న్‌గా చూపించాడు తేజ‌. ఆ సినిమా గోపీచంద్ కెరీర్‌నే మార్చేసింది. హీరోగా సెటిల్ అవ్వ‌డానికి దోహ‌దం చేసింది. ఇప్పుడు మ‌ళ్లీ గోపీచంద్ కెరీర్‌ని ఓ గాడిలో పెట్ట‌డానికి తేజ ముందుకు రావ‌డం శుభ‌ప‌రిణామ‌మే. మ‌రి.. ఈ కాంబోలో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close