తేజ డ‌బుల్ ధ‌మాకా : ఇటు బాల‌య్య అటు వెంకీ

ఒక్క హిట్టు ఫేటు మొత్తం మార్చేస్తుంది. అప్ప‌టి వ‌ర‌కూ సైడ్ లైట్‌లో ఉన్న‌వాళ్లంతా ఫ్లెడ్ లైట్ వెలుగుల్లోకి వ‌చ్చేస్తారు. ఇప్పుడు తేజ ప‌రిస్థితి కూడా అంతే. వ‌రుస ఫ్లాపుల‌తో నీర‌స‌ప‌డిపోయాడు తేజ‌. ఆయ‌న‌తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు, క‌థానాయ‌కులు వెనుకంజ వేశారు. ఆఖ‌రికి సినిమాల్లేక ఖాళీగా ఉన్న రాజ‌శేఖ‌ర్ కూడా తేజ‌తో సినిమా చేయ‌డానికి ‘నో’ అనేశాడు. అయితే… ‘నేనే రాజు నేనే మంత్రి’తో త‌న పాత ఫామ్ ని మ‌ళ్లీ అందిపుచ్చుకొన్నాడు. త‌న‌దైన రోజున కచ్చితంగా హిట్ కొట్ట‌గ‌ల‌డు అని నిరూపించుకొన్నాడు. ఓ హిట్ కొట్టాడో లేడో.. ఇప్పుడు అగ్ర క‌థానాయ‌కులూ అవ‌కాశం ఇవ్వ‌డానికి రెడీ అయిపోయారు.

ఎన్టీఆర్ బ‌యోపిక్ చేసే బాధ్య‌త తేజ చేతిలో పెట్టాడు బాల‌య్య‌. ఆ సినిమాకి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. ఇప్పుడు వెంక‌టేష్‌తో సినిమా కూడా ఓకే అయిపోయింది. ‘త్వ‌ర‌లోనే రెండు పెద్ద సినిమాలు మొద‌లెడుతున్నా’ అంటూ ఫేస్ బుక్ ఖాతాలో త‌న ఆనందాన్ని పంచుకొన్నాడు తేజ‌. ‘నేనే రాజు నేనే మంత్రి’కి ముందే వెంక‌టేష్‌తో ఓ సినిమా చేయాల్సింది తేజ‌. కానీ.. కుద‌ర్లేదు. ఇప్పుడు తేజ చేతిలొ హిట్ వ‌చ్చేస‌రికి.. సురేష్ బాబు మేల్కొని వెంట‌నే తేజ‌కి మ‌రో ఆఫ‌ర్ ఇచ్చేశాడు. ఈ రెండు చిత్రాల్లో ముందుగా ఏది ప‌ట్టాలెక్కుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.