తెలకపల్లి రవి : కెసిఆర్‌ మాటలను సవరించిన కెటిఆర్‌ చతురత

తెలంగాణ ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఎవరికి ఓటేస్తారనే ఒక చర్చ మీడియాలో నడుస్తున్నది. రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించడానికి వేర్వేరు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిజామాబాద్‌లో రెండవ సభలోనే ఇక్కడ స్థిరపడిన వారంతా తెలంగాణ బిడ్డలేనని చెప్పారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలలో చెప్పిన దానికి ఇది కొంచెం భిన్నం. కాళ్లో ముళ్లు పంటితో తీయడం అప్పటి మాట. అందరూ తెలంగాణ బిడ్డలేనన్నది ఇప్పటి మాట. మధ్యలో ప్రపంచ తెలుగు మహాసభలు కూడా జరిపిన కెసిఆర్‌ పై సభలోనే తెలుగు సెంటిమెంటుతో ఎంత కాలం రాజకీయం చేస్తారని కూడా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు ఛానళ్లు ఈ ఓటర్లపై అభిప్రాయం అడిగినప్పుడు ఈ తేడా గుర్తు చేశాను. తర్వాత కెటిఆర్‌ ఇక్కడున్న కోస్తా రాయలసీమ వారికి తాను అండగా వుంటానని ప్రత్యేకంగా చెప్పారు. ఇక్కడ సంబోధనలోనే తేడా చూడొచ్చు. తెలంగాణ ఆంధ్ర అన్నది ఒక విభజనగా నడిచింది. అయితే అప్పటికి ఇంకా ఉమ్మడి రాష్ట్రం గనక సీమాంధ్రులు పదం కొత్తగా రూపొందింది. ఇప్పుడు అంత సూక్ష్మ విభజన వుండదు. కాని కెటిఆర్‌ ఆంధ్ర అనకుండా కోస్తా, రాయలసీమ అంటున్నారంటే పాత ఫక్కీలోనే మూడు ప్రాంతాలలోని వారి తెలుగు బంధాన్ని గుర్తిస్తున్నారన్న మాట. వారికి భరోసాగా తాను వుంటానని కెటిఆర్‌ అంటే వారికోసం ఒక సెల్‌ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు. వాస్తవానికి ఇవన్నీ మాట్లాడే పరిస్థితి హైదరాబాద్‌లోనూ ఇతర చోట్ల లేకున్నా ఎన్న్కికల తరుణం గనక అంటున్నారు.

2014 శాసనసభ ఎన్నికల నాటితో పోలిస్తే 2016 జిహెచ్‌ఎంసి ఎన్నికల నాటికి హైదరాబాద్‌లో ఓట్ల సీట్ట పరిస్థితి పూర్తిగా తారుమారైంది. దాదాపు గుండగుత్తగా టిఆర్‌ఎస్‌ జైత్రయాత్ర చేసింది. ఆ ఎన్నికల్లో 43 శాతం ఓటు ్ల తెచ్చుకున్న టిఆర్‌ఎస్‌ ను వ్యతిరేకించిన వారు కూడా గణనీయంగానే వున్నారనేది నిజమే అయినా వారంతా అలాగే వున్నారే లేదో తెలియదు. పైగా మిగిలిన ఓట్లలో విభజనలు కూడా చాలానే వుంటాయి. టిడిపి అప్పటికంటే బలహీనమై వుండటం తప్ప బలపడిందని చెప్పడం కష్టం. కాంగ్రెస్‌ కూడా దానం నాగేందర్‌ వంటివారి నిష్క్రమణతో కొంత బలం కోల్పోయింది. కనుక హైదరాబాద్‌ దాని పరిసరాల్లో 2014లాగే టిఆర్‌ఎస్‌ నష్టపోతుందని చెప్పడానికి ఆధారాలేమీ లేవు.

ఇక ఓటర్ల విషయానికి వస్తే కొద్ది శాతం తప్ప అత్యధికులు తమ వృత్తి వ్యాపారాలను బట్టి సామాజిక రాజకీయానుబంధాలను బట్టి ఓటేస్తారు తప్ప ప్రాంతీయ మూలాలను బట్టి కాదు. తెలంగాణ ఏర్పడిన నాటి వేడి వాడి ఇప్పుడు వుండవు కూడా. నిజానికి కాంగ్రెస్‌ కావాలని వాటిని ఎక్కువగా రేకెత్తే ప్రయత్నం చేస్తుంటుంది. నిజంగా అభద్రత గురించి అధికంగా మాట్లాడితే అప్పుడు అధికార పార్టీకి మరింత మేలు జరుగుతుంది. వ్యాపారస్తులు ఎలాటి అస్థిరత కోరరు. పేదలు శ్రమజీవులు అన్నిచోట్లలాగే ఇక్కడా వ్యవహరిస్తారు. ఇక కులాలను బట్టి, రాజకీయానుబంధాలను బట్టి ఓటు వేసే వారు మూలాలు ఏవైనా వాటిని బట్టే చేస్తారు. ఆ మాటకొస్తే కోస్తా రాయలసీమ వారే గాక ఇతర గుజరాతీలు మహారాష్ల్రుటు కూడా గణనీయంగానే వుంటారు. వారిలో కొందరు ప్రజా ప్రతినిధులైనారు కూడా. ఎవరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా తమ పరిస్థితులను బట్టి అంచనాలను బట్టి ఓటేయడమే జరుగుతుంది. తెలుగుదేశం ప్రవేశంతో తెలంగాణ ఎన్నికల దృశ్యం ఏదో తలకిందులుగా మారిపోతుందని ఆ పార్టీ వర్గాలు చేస్తున్న ప్రచారం అవాస్తవికమైంది. పైగా హేమాహేమీల ఫిరాయింపు తర్వాత వారు అంతగా పుంజుకున్నదీ లేదు. చంద్రబాబు ఎంత ఎక్కువ కేంద్రీకరిస్తే ఆ పార్టీకి అది అంత ప్రతికూలంగా వుంటుంది. ఆ సంగతి తెలుసుగనకే ఆయన మొదట్లో ప్రచారానికి తటపటాయించారు. ఇప్పుడు కూడా పరిమితంగానే పర్యటిస్తారని నేననుకుంటాను.

కెటిఆర్‌ మాటల్లో మరో ముఖ్యమైన సవరింపు కూడా వుంది. తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేఖలు రాయడం తప్పు కాదని అనడం చాలా కీలకమైన వ్యాఖ్యానం. రాష్ట్ర విభజన అయినప్పటి నుంచి ఈ సంగతి చెబుతున్న వారిలో నేనొకణ్ని. ఉభయ రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాలు రాజకీయ పక్షాలు వేర్వేరన్నది కాదనలేని సత్యం.విభజనానంతర సమస్యలు గాని నైసర్గికంగా వుండే నదీజలాల వంటి అంశాలు గాని ప్రభుత్వాలుగా లేఖలు రాసుకోకపోతే కుదరదు. నీటి పారుదల మంత్రి హరీశ్‌ రావు లేఖలను తప్పులుగా చూపిస్తుంటే కెటిఆర్‌ వాటి రాజ్యాంగ బద్దతను ఆమోదించడం ఆసక్తికరం. ఇవి రెండు కోణాలు మాత్రమే. ఒక విధంగా ఈ విషయంలో నాన్న కెసిఆర, బావ హరీష్‌ ్‌ దాడి తీవ్రతను కెటిఆర్‌ సవరించారన్నమాట. అది కోస్తా రాయలసీమ ఓటర్లను ఒప్పించడం కోసమే కావచ్చు గాని ఆహ్వానించదగిన మార్పు. ఇదే నిగ్రహం అందరూ ఎన్నికలు ముగిసేదాకా చూపిస్తే మంచిది. తెలంగాణ అంటే కెసిఆర్‌ కుటుంబమే కాదంటున్న మహాకూటమి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఎపి అంటే టిడిపి చంద్రబాబు మాత్రమే కాదని కూడా గుర్తించవలసి వుంటుంది.కాబట్టి ఆ ప్రాంతాల వారు వారి వారి నేపథ్యాలను రాజకీయ సామాజిక అనుబంధాలను బట్టి మాత్రమే ఓటేస్తారు. ఈ విషయంలో టిఆర్‌ఎస్‌ మాత్రమే గాక కాంగ్రెస్‌ తెలుగుదేశం నాయకులు కూడా నిగ్రహించి మాట్లాడకపోతే నష్టపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో యూఎస్‌లో  'అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ షోను ఏర్పాటు చేసిన  హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. సెన్సేష‌న‌ల్ కాన్స‌ర్ట్స్ ఏర్పాటుచేయ‌డంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్...

శ్రీ‌నువైట్ల మ‌ల్టీస్టార‌ర్… ‘డ‌బుల్స్‌’

వ‌రుస హిట్లు ఇచ్చిన శ్రీ‌నువైట్ల‌.. ఇప్పుడు వ‌రుస ఫ్లాపుల‌ను మోస్తున్నాడు. అయినా స‌రే, మళ్లీ త‌న‌దైన ముద్ర వేయ‌డానికి త‌ప‌న ప‌డుతున్నాడు. అందులో భాగంగా `ఢీ అండ్ ఢీ` తీస్తున్నాడు. `డ‌బుల్ డోస్‌`...

జనసేనను మరోసారి కించ పర్చిన ఏపీ బీజేపీ..!

పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ...

ఏపీ సర్కార్‌ను అప్పులు చేయనివ్వొద్దని మోడీకి రఘురామ లేఖ..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అప్పుల మీద నడుస్తోంది. నెలకు రూ. ఆరేడు వేల కోట్లు అప్పులు ఎలాగోలా తెచ్చుకోకపోతే.. ఆ నెల దివాలా ప్రకటించాల్సిన పరిస్థితి. ఆ అప్పులు కూడా రాకుండా చేయాలని...

HOT NEWS

[X] Close
[X] Close