తెలకపల్లి రవి : డిల్లీ యాత్ర టీజరే- డిసెంబర్‌ 11 తర్వాత అసలుసినిమా

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్ర రాహుల్‌తో మరికొందరు జాతీయ ప్రతిపక్ష నేతలతో భేటీపై రకరకాల వాదనలు నడుస్తున్నాయి. రాజకీయ వ్యతిరేకులు కాంగ్రెస్‌తో కలయిక అవకాశమంటుంటే మోడీ ప్రభుత్వ పోకడలను విమర్శించే వారు ఇది ఇప్పటి పరిస్థితులకు తగినట్టే వుందంటున్నారు. అయితే అసలు సంగతి ఏమంటే ఇప్పుడు వేసింది మొదటి అడుగు మాత్రమేనని టిడిపి సీనియర్‌ నాయకులే అంటున్నారు. తమ నేతకు అలవాటైన ప్రకారమే అప్పుడే అతి ప్రచారం చేసుకోవడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు సంగతి డిసెంబర్‌ 11 తర్వాత గాని తేలదు. ఆ రోజున అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వస్తాయి. వాటిలో ఎవరు ఏ మేరకు విజయాలు సాధిస్తారనే దానిపై భవిష్యత్‌ పరిణామాలు ఆధారపడి వుంటాయని ఒక నాయకుడు స్పష్టం చేశారు. ఒక వేళ బిజెపి గనక కొంతవరకు పట్టు నిలబెట్టుకుంటే మాతో వచ్చేవారు వెనకడుగు వేయొచ్చు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు మరింత కీలకం. వారు గనక రెండు మూడు రాష్ట్రాలు తెచ్చుకోలేకపోతే కోలుకోవడం తేలిక కాదు. అప్పుడు మేము ఎన్ని తంటాలు పడినా ప్రయోజనం వుండదు. మోడీ వైపు మొగ్గు పెరగొచ్చు కాంగ్రెస్‌ ఏ మాత్రం మంచి ఫలితాలు సాధించినా అందరినీ కలిసే పని మా బాస్‌ చేయగలడు అని ఆ నాయకుడు వివరించారు.

అయితే జాతీయ రాజకీయాలు ఎలా పరిణమించినా రాష్ట్రంలో మాత్రం తాము కాంగ్రెస్‌తో కలసి వ్యవహరించవచ్చునని టిడిపి నేతలు చెబుతున్నారు. అయితే కలసి పోటీ చేస్తే తమకు కేటాయించిన చోట్ల కూడా తన అభ్యర్తులను ఎంపిక చేయించగల సత్తా చంద్రబాబుకు వుందని ఎపిసిపి నేతలు భయపడుతున్నారట. పైగా టిడిపి రాజకీయ నేపథ్యం విభజనకు సంబంధించి కాంగ్రెస్‌పై గతంలో వున్న ఆగ్రహం కారణంగా ప్రజలు ఈ కలయికను స్వీకరిస్తారా అని సందేహాలు కూడ వున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌ లాటి వార రాజీనామా చేచేశారు. కాని చింతా మోహన్‌ గౌతం వంటి వారు ఆహ్వానిస్తున్నారు. టిడిపిలో ఎష్‌సిటెస్‌టి లాబీ టిడిపికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక కథనం ఇచ్చింది. నిన్న చెప్పుకున్నట్టు చంద్రబాబుకు ముఖ్యంగా కావలసింది ఎపిలో అధికారం గనక ఆ మేరకు ఎలాగో ఒప్పించగలుగుతారని ఆ పార్టీ వర్గాలు ఆశగా వున్నాయి. జాతీయంగా ఎన్నికల తర్వాత ఎవరు ఎటు పోయినా ఇన్ని మలుపుల తర్వాత తాము ఈ సారి బిజెపికి చేరువ కాకూడదనే టిడిపి నేతలు చంద్రబాబుకు గట్టి గా చెబుతున్నట్టు తెలిసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close