తెలకపల్లి రవి : చంద్రబాబు, కెసిఆర్‌ పాచికలు- మిథ్యా శత్రువులు

అసలు శత్రువును దెబ్బతీయాలంటే లేని శత్రువును ముందుకు తేవాలన్న వ్యూహం తెలంగాణ ఎపి ముఖ్యమంత్రులు బాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌తో జట్టుకట్టి దాన్ని ఢిల్లీ దాకా చేర్చారు టిడిపి అద్యక్షుడు చంద్రబాబు నాయుడు అసలు లక్ష్యం ఎపిలో అధికారం నిలబెట్టుకుని తెలంగాణలో అస్తిత్వాన్ని నిల్పుకోవడం. ఈ కాంగ్రెస్‌ టర్న్‌కు తొలి అడుగు తెలంగాణలో వేశారు గనక ఆ ముఖ్యమంత్రి దాన్ని తన ఆయుదంగా చేసుకున్నారు. మళ్లీ ఆంధ్ర ఆధిపత్యం అంటూ పల్లవి ఎత్తుకున్నారు. మొత్తం టిఆర్‌ఎస్‌ నాయకులంతా దాన్నే అందిపుచ్చుకున్నారు. ఆఖరుకు ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్త పలుకులో కూడా చంద్రబాబు జోక్యమే ప్రధానాంశమైనట్టు చెబుతున్నారు. అసలు ప్రత్యర్తిగా వున్న కాంగ్రెస్‌ను తక్కువ చేయడం కెసిఆర్‌కు ఒక విధంగా అవసరం. చంద్రబాబు ప్రభావం ఎక్కువగా చూపడం ఆర్కే సహజ లక్షణం. తన పాత్ర ఏమీ వుండదంటూనే ఈ మిథ్య్నను కొనసాగించడం చంద్రబాబుకు అవసరం.

ఎపికి వస్తే ప్రత్యేక హోదా విభజన నిధుల విషయంలో మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం నిరాకరణ నిజం . అయితే ఆ విషయమై అయిదేళ్లలో నాలుగేళ్లకు పైనమాట్లాడకుండా వుండిపోయిన టిడిపి ఇప్పుడు తనే వీరోచిత పోరాటం చేస్తున్నట్టు చెప్పుకోవడంలో విశ్వసనీయత లేదు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ప్రదానాంశమైనట్టు చంద్రబాబు రోజుకు పదిసార్లు చెబుతున్నారు. పైగా జగన్‌,పవన్‌ కళ్యాణ్‌లు మోడీతో చేతులు కలిపినట్టు ఆరోపిస్తున్నారు. ఎవరు ఏం చెప్పినా ఎపిలో బిజెపి చెప్పుకోదగిన శక్తి కానేకాదు. దాన్ని ముందు పెట్టి వైసీపీ జనసేనలను దెబ్బతీయాలని చంద్రబాబు వ్యూహం. దానికోసం లేని బిజెపిని పెద్దది చేసి వున్న రెండు ప్రధాన పార్టీలను దానికి తోకలుగా చూపిస్తున్నారు.

మొత్తంపైన ఉభయ చంద్రులూ ఒకే రకం రాజకీయాలు పాటిస్తున్నారన్న మాట. శుభం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ “రండ” రచ్చ !

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం బీజేపీని కిషన్ రెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. కేంద్రం ధాన్యం కొనబోమని చెప్పిందని .. కానీ కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. అయన...

పాజిటివ్ స్టెప్‌తో టీ కాంగ్రెస్‌కు టీఆర్ఎస్‌ షాక్ !

కాంగ్రెస్ విషయంలో టీఆర్ఎస్ తీసుకుంటున్న నిర్ణయాలు అనూహ్యంగా ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి భేటీకి టీఆర్ఎస్ నేత కేశవరావు...

సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత

దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల సిరివెన్నెల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. చికిత్స కోసం ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్సపొందుతూ కొద్దిసేపటిక్రితం తుది శ్వాశ...

అత్యంత విష‌మంగా సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఆరోగ్యం అత్యంత విష‌మ ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆసుప‌త్రిలో చేరిన...

HOT NEWS

[X] Close
[X] Close