తెలకపల్లి రవి : భావి నాయకుడు.. పితృవాక్య పాలకుడేనట

తెలంగాణ రాజకీయ పరిణామాలను మరీ ముఖ్యంగా ఎన్నికల ప్రకటన అనంతర పరిస్థితులను పరిశీలించేవారెవరికైనా టిఆర్‌ఎస్‌ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మంత్రి కెటిఆర్‌ స్థానం సుస్థిరమైందని అర్థమవుతుంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన వెంటనే కాకున్నా కొన్నాళ్లకైనా ముఖ్యమంత్రి అవుతారన్న వాతావరణం కెసిఆర్‌ సృష్టించారన్నది కాదనలేని నిజం. దానికి సంబంధించి మరో సీనియర్‌ నాయకుడు హరీష్‌రావు పట్ల మొదట్ల్తో ఉపేక్ష చూపడం తర్వాత సర్దుకోవడం కూడా జరిగిపోయాయి. అయితే దీనికి రెండవ కోణం కూడా చూడాలని టిఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు టిడిపిలో నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు, దగ్గుబాటి వంటివారు నాయకత్వంలో కోసం పోటీ పడిన పరిస్థితి ఇప్పుడు టిఆర్‌ఎస్‌లోనూ వచ్చేసిందని వారు అంటున్నారు. కెసిఆర్‌ ఏకపక్ష శైలి దానికి ఒక కారణమైనా పైకి లోబడి వున్నట్టు కనిపించే వీరంతా తమను కూడా కీలక నేతలుగా పరిగణించుకుంటున్నారట. ఎన్నికలలో వివిధ స్థానాలలో అభ్యర్థులపై కూడా సూచనలు చేశారట. అయితే కెసిఆర్‌ మాత్రం ఎలాటి సాహసాలు చేయకుండా ప్రస్తుత ఎంఎల్‌ఎలు, గతంలో పోటీ చేసిన వారు, హామీలతో ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నవారు అనే ప్రకారమే జాబితా విడుదల చేశారు. ముగ్గురు నలుగురినే మార్చారు. ఆ నిర్ణయం కూడా దాదాపు తనే తీసుకున్నారు. ఈ హఠాత్పరిణామం ఆశ్చర్యం కలిగించినా కెటిఆర్‌ మాత్రమే సర్దుకుని ప్రచారంలో దిగిపోయారు. మిగిలిన వారికి తాము చెప్పిన ఒకరికైనా చోటు కల్పించలేదన్న వాస్తవం జీర్ణించుకోవడం కష్టమైంది. చెప్పి టికెట్‌ ఇప్పిస్తామని ఇంతకాలం తిప్పుకున్న నేతల ముందు తలతీసేసి నట్టయిందని వారి గగ్గోలు. కాని కెసిఆర్‌ లెక్క వేరు. అప్పుడే అందరి మాట వినడం మొదలుపెడితే తనే సమాంతర శిబిరాలను ప్రోత్సహించినట్టు అవుతుందని జాగ్రత్త పడ్డారు. రాజకీయ అనుకూలతపైనే జయాపజయాలు ఆధారపడివుంటాయని ఆయన నిశ్చితాభిప్రాయంతో వుంటారు.

తమ అవకాశాలు అతిగా అంచనా వేసుకోవడం లేదు గనకే పకడ్బందీగా అన్ని చోట్లకు తిరగాలని ప్రణాళిక వేసుకున్నారు. కెటిఆర్‌ ఇప్పటికే అక్కడ సభలు పెట్టి రంగం సిద్ధం చేస్తున్నారు. నాటి తారక రాముడి లాగానే ఇప్పుడు ఈయన కూడా పితృవాక్య పరిపాలకుడుగా నిలిచాడని అనుయాయులు ఘనంగా చెబుతున్నారు. అది పాలక పక్షంలో ఆయన స్థానం మరింత బలోపేతం చేస్తుంది. అయితే కెటిఆర్‌ తనదైన క్లాస్‌ శైలి వదలిపెట్టి మాస్‌ శైలికి దిగిపోవడంపై మాత్రం కొంత సణుగుడు వుంది. అది తండ్రికి వదిలేసి తను తనలాగే మాట్టాడితే బావుంటుందని ఒకరిద్దరు అభిప్రాయపడ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిమ్మగడ్డను కలిసిన సీఎస్..! రివర్స్ వాదన..?

స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పార్టీ పరంగా తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించిన వైసీపీ... అధికారికంగా మాత్రం సీఎస్...

రాజధాని రైతులకు బేడీలు వేసిన పోలీసులపై వేటు..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతికి భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా బేడీలు వేసి.. జైలుకు తరలించిన ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లను గుంటూరు ఎస్పీ విశాల్...

వైసీపీ వైపు సీపీఎం.. ఎన్నికల వైపు మిగతా పార్టీలు..!

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల అభిప్రాయాలు సేకరించారు. అధికార పార్టీ వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. హాజరైన పార్టీల్లో ఒక్క...

రూ.2 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్‌

క‌రోనా చిత్ర‌సీమ‌ని పూర్తిగా సంక్షోభంలో నెట్టేసింది. సినిమా రంగం కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. నిర్మాత‌ల‌కు కాస్త ఉత్సాహాన్ని, ఊపిరిని ఇవ్వాలంటే తార‌లు పారితోషికం త‌గ్గించుకోవాల్సిందే అంటూ స‌ల‌హా...

HOT NEWS

[X] Close
[X] Close