తెలకపల్లి రవి : తాటతీస్తానంటే తప్పయిందా?

తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌ కళ్యాణ్‌ సభలకు యువత హాజరు స్పందన కూడా చాలా ఉధృతంగా వున్నాయి. ఇలాటి ఐచ్చిక స్పందన చూసి చాలా రోజులైంది. కమ్యూనిస్టులను పక్కనపెడితే మిగిలిన పార్టీలన్నీ ముఖ్యంగా పెద్ద పార్టీలు భారీగా డబ్బు ఖర్చు చేస్తే తప్ప జనసమీకరణ సాధ్యపడటం లేదు. టిడిపి ప్రభుత్వమో పార్టీనో తెలియకుండా ధర్మపోరాటం వంటివి చేసినప్డ్పుడు కూడా సమీకరణ స్పందన పరిమితంగానే వుంటున్నాయి.చేతులెత్తండి, చప్పట్లు కొట్టండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్‌ తమ సభల్లో కోరినా వారు ఆశించినంత వుండటం లేదు. ఈ విషయంలో పవన్‌సభలు మాత్రం జనంతో కిక్కిరిసి పోవడమే గాక యువత కేకలు మోగిపోతున్నాయి.ఆయన ప్రత్యర్థులపై దాడి చేసినప్పుడు ఏదైనా సవాలు విసిరినప్పుడు మరీ ఎక్కువగా వుంటున్నది. వాస్తవాలు ఒప్పుకునేవారెవరైనా ఈ తేడా చూడక తప్పదు.

అంత జనం వస్తే నాయకుడు కూడా వూగిపోవడం తథ్యం. మామూలుగానే ఆవేశపడేపవన్‌ ఈ పరిస్థితుల్లో కొని చోట్ల మరింత ఆగ్రహావేశాలతో మాట్టాడుతున్నారు. తునికి రైలు యాత్రగా వెళ్లింది మొదలు ఈ జోష్‌ మరింత పెరిగినట్టు కనిపిస్తుంది. ఆయన వివిధ తరగతుల ప్రజలతో చర్చలు జరుపుతున్నారు. అక్కడ చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వింటుంటారు. బహిరంగ సభల్లో మాత్రం వీరావేశంతో మాట్లాడ్తుఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో భూమి పగుళ్లు బారడం, అక్రమ మైనింగ్‌ బయిటపడటం, తన కారుకు మట్టి అడ్డుపోయడం వంటివి బాగా ఆగ్రహం తెప్పించినట్టుంది. ఆ వూపు లో ఒరేరు అని తాట తీస్తానని హెచ్చరించారు. ఇంకా ఒకటి రెండు మాటలు వాడివుండొచ్చు. ఏమైనా అవనీ తప్పు చేసిన వారిని తనను అడ్డుకున్న వారిని తప్ప పెద్ద నాయకులనేమీ అన్నది లేదు. తాటతీయడం వంటి పదాలు శాసనసభలోనే ఇరుపక్షాలు వాడుతున్నారు. జగన్‌పై దాడి తర్వాత ఎలాటి బూతులు తిట్టుకున్నారో కూడా అంతా చూవారు. అలాటప్పుడు పవన్‌ ఒక్కరే మహాపరాథం చేసినట్టు బూతులు మాట్టాడినట్లు నీతులు చెప్పడం హాస్యాస్పదం. తాను అప్రజాస్వామికంగా మాట్లాడబోనని ఆయనే ముందుగా చెప్పారు. ఆవేశంలో మాట తీవ్రమైతే సర్దుకుంటారు. అయినా అక్రమ మైనింగ్‌ చేసేవారిని లేదా గుండాగిరీ చేసేవారిని అంటే ఎవరైనా ఎందుకు నొచ్చుకోవాలి? ఒక్కసారి శాసనసభ రికార్డులు సీనియర్ల సభా ప్రసంగాలు చూస్తే తెలుస్తుంది ఆయన మాట్లాడింది ఏ మూలకు రాదని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు కుప్పం వస్తే బాంబులేస్తాం.. వైసీపీ నేతల హెచ్చరిక !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబును రెండు రోజులు తెలుగు భాషలో ఎన్ని తిట్లు ఉన్నాయో అన్నితిట్లు తిడుతున్నారు. పట్టాభి సీఎంను అసభ్యంగా ఓ పదంతో తిట్టారని.. టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ...

“మా” ఎన్నికలకు వైసీపీ పరిశీలకుడిగా రౌడీషీటర్ వచ్చారట !

"మా" ఎన్నికలను పర్యవేక్షించి మంచు విష్ణును గెలిపించేందుకు వైసీపీ తరపున ఎన్నికల పరిశీలకుడిగా ఓ నొటొరియస్ క్రిమినల్‌ను పంపినట్లుగా ప్రకాష్ రాజ్ కొత్తగా ఆరోపణలు చేశాయి. ఎన్నికలు జరుగుతున్నసమయంలో.. కౌంటింగ్‌లో ఫోన్‌లో...

విమర్శలు ప్రజాస్వామ్యసహితంగా ఉండాలి : విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో బూతులు, నీచమైన భాషతో ట్వీట్లు పెట్టే వారిలో నెంబర్ వన్ స్థానంలో ఉండే విజయసాయిరెడ్డి కూడా .. రాజకీయ విమర్శలు ఎలా ఉండాలో పాఠాలు చెబుతున్నారు. విశాఖలో వైసీపీ నేతలు ఏర్పాటు...

‘గామి’ కి బన్నీ మాట సాయం

గామి.. ఇప్పటి సినిమా కాదు. నాలుగేళ్ల క్రితం గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ స్టయిల్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు దర్శకుడు కాగిత విద్యాధర్‌. తను నమ్ముకున్న కాన్సెప్ట్ ఎలాగైనా ప్రేక్షకులకు చూపించాలని...

HOT NEWS

[X] Close
[X] Close