ప్రొ.నాగేశ్వర్ : పోలవరంపై తెలంగాణ అఫిడవిట్‌..! రాజకీయం ఉందా..?

తెలంగాణ ప్రభుత్వం… పోలవరం ప్రాజెక్ట్ ప్రభావాన్ని పునస్సమీక్షించాలని.. అప్పటి వరకు ప్రాజెక్టును నిలిపివేయాలని.. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఇప్పటికే.. పోలవరం ప్రాజెక్ట్‌పై కుట్రలు జరుగుతున్నాయని.. టీడీపీలో రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్న సమయంలో… జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా టీఆర్ఎస్ మాట్లాడుతున్న సమయంలో.. ఇలాంటి అఫిడవిట్ వేయడం.. సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.ఓ వైపు.. కేసీఆర్‌తో కలిస్తే తప్పేమిటని… జగన్ అంటున్నప్పుడే.. ఈ అఫిడవిట్… సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ దాఖలు చేసింది.

పోలవరంపై టీఆర్ఎస్‌ది మొదటి నుంచి ఒకటే విధానం..!

పోలవరం నిర్మాణాన్ని ఆపేయాయని.. తెలంగాణ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. తెలంగాణ ప్రభుత్వ విధావం అదే. ఏపీలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నందున.. ఇప్పుడు విధానాన్ని మార్చుకుంటుదంని అనుకోలేం. పోలవరం ప్రాజెక్టులపై… తెలంగాణది మొదటి నుంచి అదే వైఖరి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారని కాబట్టి.. తన వైఖరి మార్చుకోలేదు. అఫిడవిట్ ఇలాంటి సమయంలో దాఖలు చేయాల్సి వచ్చినా… వైఖరిని మార్చుకోలేదు. ఈ వైఖరిని అభినందించాలి. ఎందుకంటే.. రాజకీయ ప్రయోనాల కోసం.. రాష్ట్ర ప్రయోజనాలపై సున్నితంగా వ్యవహరించలేదు. ఈ వైఖరిని కచ్చితంగా అభినందిచాల్సిందే. ఒక విధానానికి కట్టుబడి ఉండాలి. పోలవరంపై గతంలో అబ్జెక్షన్స్ లేవనెత్తారు. ఇప్పుడు లేవనెత్తితే.. జగన్‌కు ఇబ్బంది అవుతుందా.. చంద్రబాబుకు అవుతుందా.. అని .. విధానం మార్చుకుంటే.. తప్పు అవుతుంది కదా..!. పైగా.. అఫిడవిట్‌లో చెప్పినవన్నీ.. చాలా కాలంగా.. తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెస్తున్న అంశాలే.

జగన్‌ కోసం… పోలవరంపై తెలంగాణ విధానాన్ని మార్చుకోదు..!

తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా.. పోలవరం ప్రాజెక్ట్‌ను టీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఖమ్మం జిల్లాలో అన్ని పార్టీలు … ప్రాజెక్టును వ్యతిరేకించాయి. అయితే.. పోలవరం ప్రాజెక్ట్ కట్ట కూడదని.. సముద్రంలోకి వెళ్లిపోతున్న నాలుగైదు వేల టీఎంసీల నీటిని ఏపీ వాడుకోకూడదని… ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యవసాయం బాగుండకూడదని… ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకించలేదు. ఇది ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా కాదు. పోలవరం ప్రాజెక్ట్ కన్నా.. ఐదారు చిన్న బ్యారేజీలు కట్టుకోవడం ద్వారా.. ఎక్కువ బెనిఫిట్ ఉంటుందన్న విశ్లేషణలు వచ్చాయి. పోలవరం ప్రాజెక్ట్‌ ఒక్కటే కడితే ముంపు ఎక్కువగా ఉంటుంది. రెండు లక్షల మంది నిర్వాసితులవుతారు. ఏడు మండలాలు ముంపులకు గురవుతున్నాయి. భారీగా విధ్వంసం జరుగుతున్నందున… రీ డిజైన్ చేయండి.. అనే వాదన వినిపించారు. కారణం ఏదైనా… రాష్ట్ర విభజన తర్వాత … ఆ వాదన పక్కుకుపోయింది. ఎందుకంటే… రాష్ట్ర విభజనలో…ఏపీకి తీవ్రంగా నష్టం జరిగిందనే భావన రావడంతో… పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చారు. అన్ని అనుమతులు వచ్చినట్లుగా ప్రకటించారు. అప్పుడు ఆ వాదన ఆగిపోయింది. ఇప్పుడు.. టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి ఆ వాదన తెరపైకి తెచ్చింది.

జగన్‌ను కేసీఆర్ సమర్థించడం వల్లే రాజకీయ ప్రశ్నలు..!

అప్పట్లో నీటి సామర్ధ్యం.. ఇప్పటి సామర్థ్యం ప్రకారం చూస్తే.. దాదాపుగా నలభై శాతం.. పెద్దగా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు కాబట్టి… ప్రభావాన్ని మరోసారి అంచనా వేయాలని తెలంగాణ కోరుతోంది. అగే.. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం… పట్టిసీమ ద్వారాఏపీ వాడుకుంటున్న నీటికి తగ్గినట్లుగా… ఎగువన మేము వాడుకుంటామని.. తెలంగాణ వాదిస్తోంది. పోలవరం పై జాతీయ ఇవ్వడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఇలా అభ్యంతరం చెప్పడానికి అవకాశం లేదు. పార్లమెంట్ ఆమోదించిన చట్టంలోనే… ఆ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. ఈ వాదనలను.. అంగీకరించేవారు ఉండొచ్చు. వ్యతిరేకించే వారు ఉండొచ్చు. అయితే.. ఈ వాదనలపై కొత్తవి కాదు. అయితే.. ఇదే సమయంలో… జగన్మోహన్ రెడ్డి.. కేసీఆర్‌తో స్నేహం చేస్తే తప్పేంటి అని మాట్లాడటంతోనే… టీడీపీకి ఆయుధంగా దొరికింది. కేసీఆర్ ఒడిషాకు వెళ్లి.. నవీన్ పట్నాయక్‌తో.. పోలవరం ప్రాజెక్ట్‌పై మాట్లాడారు. ఇప్పుడు వ్యతిరేకంగా అఫిడవిట్ వేశారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్‌లో కేసీఆర్, జగన్ మాత్రమే ఉన్నారు. కేసీఆర్ మాటల్ని జగన్ సమర్థిస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ను జగన్ ఎలా సమర్థిస్తారనే రాజకీయ ప్రశ్నలు అలా వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.