అధికారుల‌ను విధుల్లోంచి త‌ప్పిస్తార‌ని ఆయ‌న‌కి ముందే ఎలా తెలుసు?

వైకాపా, భాజ‌పాల మ‌ధ్య ర‌హ‌స్య స్నేహం మ‌రోసారి బ‌హిర్గ‌త‌మైన సంద‌ర్భం ఇది. కేంద్రం, వైకాపా కుమ్మ‌క్కై.. ఏపీ అధికార పార్టీపై క‌క్ష సాధింపుల‌కు దిగుతోంద‌న‌డానికి తాజాగా ఉన్న‌తాధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డ‌మే మ‌రో సాక్ష్యం. విచిత్రం ఏంటంటే… ఆయా అధికారుల‌కు క‌నీసం నోటీసులు కూడా ఇవ్వ‌కుండా, కేవ‌లం వైకాపా ఫిర్యాదును మాత్ర‌మే ప్రాతిప‌దిక‌గా తీసుకుని కేంద్రం స్పందించ‌డం. స‌రే, దీనికి ధీటుగా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ స్పందించింది. వారు చెయ్యాల్సిన న్యాయ‌పోరాటం చేస్తామ‌నీ అంటున్నారు. అయితే, ఇదంతా ఇవాళ్ల జ‌రిగిన విష‌యంగా మ‌నం చూస్తున్నాం. అచ్చంగా ఇది ఇలానే జ‌రుగుతుంద‌ని గ‌త శుక్ర‌వార‌మే ఒక వ్య‌క్తికి తెలుసట‌. ఆయ‌నే… వైకాపా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.

గ‌త శుక్ర‌వారం విజ‌య‌సాయి రెడ్డి ఢిల్లీలో మీడియా మిత్రుల‌తో ఇదే అంశ‌మై మాట్లాడారు. ఏపీలో చంద్ర‌బాబు నాయుడుకు కొమ్ము కాసే విధంగా కొంత‌మంది ఉన్న‌తాధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈసీని కోరుతున్నామ‌ని అన్నార‌ట‌. అంతేకాదు… తాము సోమ‌వారం ఫిర్యాదు చేయ‌బోతున్నామ‌నీ, ఆయా అధికారుల‌పై మంగ‌ళ‌వారం చ‌ర్య‌లు ఉండేలా జీవోలు వ‌చ్చేస్తాయ‌ని కూడా విజ‌య‌సాయి ఆరోజునే చెప్పార‌ట‌. ఆ అధికారుల‌ను విధుల్లోంచి త‌ప్పించ‌బోతున్నార‌ని కూడా చెప్పిన‌ట్టు స‌మాచారం. అచ్చంగా అలానే జ‌రిగింది.

ఫిర్యాదు చేయ‌డానికి ముందే… ఈసీ తీసుకునే చ‌ర్య‌లు, అధికారుల‌ను విధుల్లోంచి తొల‌గిస్తున్న‌ట్టు జారీ కాబోయే ఉత్త‌ర్వుల గురించి విజ‌యసాయి రెడ్డికి ఎలా తెలిసిన‌ట్టు? అంటే, ఏపీలో జ‌గ‌ర‌బోయే ఈ త‌ర‌హా ప‌రిణామాలు విజ‌యసాయి రెడ్డి లాంటివారికి ముందుగా తెలుస్తున్నాయంటే… భాజ‌పాతో వారు ఏ స్థాయి దోస్తీతో ఉన్న‌ట్టు? ఏపీలో టీడీపీని దెబ్బ‌తియ్యాల‌నే ఉమ్మ‌డి ల‌క్ష్యంతో భాజ‌పా, వైకాపాలు క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని అన‌డానికి ఇంత‌కంటే ఇంకేం కావాలి? ఈ తాజా బ‌దిలీల వ్య‌వ‌హారం వెన‌క వైకాపా, భాజ‌పాల మిలాక‌త్ ఉంద‌ని బ‌యటకి రావ‌డంతో… రాజ‌కీయంగా ఈ అంశం కూడా వైకాపాకి మైన‌స్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌. ఎన్నిక‌ల్లో నేరుగా టీడీపీని ఎదుర్కొనే వ్యూహాల కంటే, ఇలా ఇత‌ర మార్గాల్లో దెబ్బ తీయ‌డానికే వైకాపా ఎక్కువ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఇప్పుడు మ‌రోసారి ప్ర‌జ‌లు చ‌ర్చించుకునేలా ప‌రిస్థితి మారుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రైనా, రాయుడు లేకపోతే ధోనీ కూడా నిస్సహాయుడేనా..!?

ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలసి రావడం లేదు. టోర్నీ ప్రారంభం కాక ముందే సురేష్ రైనా ఇంటికెళ్లిపోయాడు. రైనా లేకపోయినా రైజింగ్ అవుతామని తొలి మ్యాచ్‌లో రాయుడు...

ఏపీలో అంతే..! బామ్మర్ది వ్యాపార గొడవల్లో దమ్మాలపాటిపై కేసు..!

మాజీ అడ్వకేట్ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై హైకోర్టు ఓ కేసులో స్టే ఇచ్చింది కానీ.. ప్రభుత్వం మరో కేసు పెట్టింది. ఓ సివిల్ తగాదా విషయంలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన దాన్ని...

జీవీఎల్, రామ్‌మాధవ్, మురళీధర్‌రావులకు పార్టీ పదవులు ఊస్ట్..!

జీవీఎల్ నరసింహారావు, రామ్‌మాధవ్, మురళీధర్ రావులను పార్టీ పదవుల నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలగించారు. కొత్త కార్యవర్గాన్ని ఆయన ప్రకటించారు. ఈ జాబితాలో ఈ ముగ్గురికీ చోటు లభించలేదు....

“ఆ నాన్చుడు” ఇంకా తగ్గించని చంద్రబాబు..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం అయినా ఫటాఫట్ తీసుకోరు. కనీసం ఆలోచించి అయినా తీసుకుంటారా అంటే అదీ లేదు. చివరికి వరకు చూసి... ఎవరు ఎక్కువ ఒత్తిడి తెస్తే వారికే...

HOT NEWS

[X] Close
[X] Close