తెలంగాణ బీజేపీ ప్రచార సారధి ఈటల రాజేందర్ !?

ఎంతో హైప్ తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ ఇప్పుడు అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. అధికారం సంగతి ఎలా ఉన్నా పార్టీ పరిస్థితి అస్తవ్యస్థంగా మారుతోంది. బీజేపీలో గతంలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు లేదు. పార్టీలోకి వలస వచ్చిన నేతలు.. పాత నేతల మధ్య కోల్డ్ వార్ తారా స్థాయికి చేరింది. బీజేపీ లో కోవర్టులు ఉన్నారని, వారే కాషాయ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని, వారి గురించి త్వరలోనే పేర్లు బయటపెడతామని కొంత మంది చేస్తున్న ప్రకటనలతో పరిస్థితి దిగజారిపతోంది.

కోవర్టుల గురించి ఈటల మొదలు చాలా మంది నేతలు ప్రస్తావిస్తున్నారు. ఒక విధంగా బండి సంజయ్ వర్గం..ఈట వర్గంగా పార్టీలే నేతల మధ్య చీలిక కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ఆయనను మార్చే అవకాశం లేదని హైకమాండ్ చెబుతోంది. మార్చాల్సిందేనని వలస నేతలు పట్టుబడుతున్నారు. దీంతో వలస నేతల్లో ఒకరికి పెద్ద పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. ఈటల రాజేందర్ ను కోణంలోనే ఆయనను ఢిల్లీ పిలిపించినట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తోపాటు అగ్రనేత అమిత్‌ షా ఢిల్లిలో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ప్రచార, హామీల, మేనిఫెస్టో, క్రమశిక్షణా తదితర కమిటీలను కొత్త నేతలతో అధిష్టానం భర్తీ చేయనున్నట్లు కూడా చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్‌ కు ఎన్నికల వ్యూహాల ఖరారు కమిటీ లేదా ప్రచార కమిటీ వంటి కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ను మారుస్తారని ప్రచారం సాగుతున్నా.. ఎన్నికల సమయంలో సాధ్యం కాదని ఇప్పటికే తేల్చి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close