తెలంగాణలో మరో 43 పాజిటివ్ కేసులు.. టోటల్ 272..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. శనివారం రోజు.. ఈ సంఖ్య 43కి చేరింది. వివిధ జిల్లాల్లో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు.. వారి పాజిటివ్ కేసులు కలిపి… వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారికి ఈ వైరస్ సోకింది. ఆదిలాబాద్ నుంచి నల్లగొండ వరకూ.. పాజిటివ్ కేసులు తేలిన వారు ఉన్నారు. వరంగల్‌లోనూ పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 90 శాతం వరకూ పాజిటివ్ కేసులు బయటపడుతూ వచ్చాయి. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి వల్ల జిల్లాల్లోనూ ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం రోజు.. 75 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ 32 మంది కి కరోనా నయం అయింది.

దేశం మొత్తం తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లిన వారి కారణంగానే… పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు ఉన్న మహారాష్ట్రలో శనివారం మరో 47 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. వీరందరూ తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వెళ్లిన వారే. తమిళనాడు, కర్ణాటకల్లోనూ.. అత్యధికంగా తబ్లిగీలకే పాజిటివ్ గా తేలుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మూడు వేల పాజిటివ్ కేసులు దాటిపోయింది. మృతుల సంఖ్య వందకు చేరువ అవుతోంది. మరో వైపు ప్రధానమంత్రి దేశంలోని పరిస్థితులపై విపక్షాలతో చర్చించాలని అనుకుంటున్నారు.

ఎనిమిదో తేదీన అఖిలపక్ష సమావేశాన్ని.. ఏర్పాటు చేశారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరగనున్న ఈ భేటీలో.. లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్ని చర్చిచే అవకాశం ఉంది. తబ్లిగీలు తప్ప.. ఇతర పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గిపోయినందున.. లాక్ డౌన్ రిలాక్సేషన్ ఇస్తే ఎలా ఉంటుందన్నదానిపై విపక్షాల సూచలను ప్రధాని తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

HOT NEWS

[X] Close
[X] Close