టాలీవుడ్ అంటే జాన్వీకి అంత చిన్న చూపేలా?

శ్రీ‌దేవి కుమార్తె జాన్వీ క‌పూర్‌ని టాలీవుడ్ కి తీసుకురావాల‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ – పూరి జ‌గ‌న్నాథ్ సినిమాలో జాన్వీ దాదాపు ఖాయం అన్న వార్త‌లొచ్చాయి. కానీ సెట్ అవ్వ‌లేదు. ఈ మ‌ధ్య మ‌రో పెద్ద నిర్మాత జాన్వీని క‌లిశార‌ని టాక్‌. అయితే జాన్వీ మాత్రం తెలుగు సినిమా చేయ‌డానికి సంసిద్ధ‌త వ్య‌క్తం చేయ‌లేద‌ట‌. త‌న‌కు పారితోషికం న‌చ్చ‌లేదా అంటే అదీ లేదు. హిందీ సినిమాకి తీసుకునే పారితోషిక‌మే ఆఫ‌ర్ చేశాడ‌ట నిర్మాత‌. కానీ జాన్వీ మాత్రం ఆ అవ‌కాశాన్ని త్రోసి పుచ్చింద‌ట‌.

తెలుగు సినిమాల్లో క‌థానాయిక పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌ద‌ని, కేవ‌లం గ్లామ‌ర్ డాళ్‌గానే చూపిస్తార‌ని, పైగా ఇక్క‌డ హీరోలు, ద‌ర్శ‌కుల డామినేష‌న్ ఎక్కువ‌ని త‌న అభిప్రాయాన్ని సూటిగా చెప్పేసింద‌ట జాన్వీ. దాంతో స‌ద‌రు నిర్మాత ఖంగుతున్నాడ‌ని టాక్‌. జాన్వీ చేసిన హిందీ సినిమాలు ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ బాప‌తు సినిమాలే. అలాంటిది.. తెలుగు సినిమా చేయ‌మంటే వంక‌లు వెద‌క‌డం ఏమిటని స‌ద‌రు నిర్మాత ఆశ్చ‌ర్య‌పోయాడ‌ని టాక్‌. జాన్వీ అనే కాదు, చాలా మంది బాలీవుడ్ భామ‌ల‌కు తెలుగు సినిమాల‌పై ఇప్ప‌టికీ ఇదే అభిప్రాయం ఉంది. తెలుగులో క‌థానాయిక‌లు భారీ పారితోషికాలు అందుకుంటున్నా, ఇక్క‌డ హీరోల‌తో పాటుగా స‌మాన‌మైన స్థాయి, క్రేజ్ అందుకుంటున్నా – అవేమీ ముంబై భామ‌ల‌కు క‌నిపించ‌డం లేదు. జాన్వీ ఈ టైపులో ఆలోచిస్తే.. త‌ను ఎప్ప‌టికీ తెలుగు సినిమానే చేయ‌క‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close