విధేయుల ఫోర‌మ్ పేరుతో పార్టీకి కొత్త త‌ల‌నొప్పి తెస్తున్నారా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ రెండు స‌మ‌స్య‌లున్నాయి. ఒక‌టీ… ఇత‌ర పార్టీల నుంచి ఎదుర్కొనే స‌మ‌స్య‌లైతే, రెండోది.. సొంత పార్టీలో నాయ‌కులు సృష్టించుకునే స‌మ‌స్య‌లు! రాష్ట్రంలో ఇప్పుడు మొద‌టి ర‌కం స‌మ‌స్య‌లను పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటోంది. గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేల‌లో కొంద‌రు తెరాస గూటికి చేరిపోయారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా పోయింది. వ‌రుస‌గా అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓడిపోయింది. త్వ‌ర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లున్నాయి. ఇన్ని స‌మ‌స్య‌లూ స‌వాళ్లూ ఎదురుగా ఉంటే… అబ్బే, మీకు ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్టుగా పార్టీలో మ‌రో కుంప‌టి రాజేస్తున్నారు కొంత‌మంది సీనియ‌ర్లు. విధేయుల ఫోర‌మ్ అంటూ కొత్త‌గా ఒక‌టి స్థాపించారు. సీనియ‌ర్ నేత‌లు వీ హ‌న్మంత‌రావు, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి. శ్యామ్ మోహ‌న్, చంద్ర‌శేఖ‌ర్, నిరంజ‌న్ రెడ్డి, కోదండ‌రెడ్డి… ఇలా కొంత‌మంది క‌లిసి ఒక ఫోర‌మ్ పెట్టారు.

ఈ ఫోర‌మ్ త‌ర‌ఫున సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. దాని సారాంశం ఏంటంటే… తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ల‌కు గుర్తింపు లేకుండా పోయింద‌నీ, అనుభ‌వ‌జ్ఞుల‌కు అవ‌కాశాలు పెంచితేనే రాష్ట్రంలో పార్టీకి పున‌ర్వైభ‌వం వ‌స్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పీసీసీ కొత్త అధ్య‌క్షుడిని నియ‌మించేముందు, ఇక్క‌డున్న సీనియ‌ర్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని, త‌మ‌లో ఒక‌రికి అవ‌కాశం క‌ల్పించాల‌ని సోనియాని లేఖ ద్వారా కోరారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించాలంటే పార్టీలో సీనియ‌ర్ల‌కు ప్రాధాన్య‌త పెంచాల‌న్నారు. కేడ‌ర్ నిరాశ‌లో ఉంద‌నీ, వారిలో ధైర్యం పెర‌గాలంటే సీనియ‌ర్ల‌కు, పార్టీని ఎప్ప‌ట్నుంచో న‌మ్ముకున్న‌వారికి గుర్తింపు ఉండాల‌న్నారు.

ఒక్క‌మాట‌లో చెప్పాలంటే… పీసీసీ కొత్త అధ్య‌క్ష ప‌ద‌విని సీనియ‌ర్ల‌కే ఇవ్వాల‌నేది వీరి డిమాండ్. దీంతోపాటు, పార్టీలో కొత్త‌గా చేరిన నేత‌ల‌కు ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంద‌నేదీ వీరి అక్క‌సు అనాలి! అయినా, తెలంగాణ‌లో ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఉన్న ప‌రిస్థితిలో సీనియ‌ర్లు ఎలా వ్య‌వ‌హ‌రించాలి..? ముందుగా పార్టీని గాడిన‌పెట్టే ప్ర‌య‌త్నాలు చెయ్యాలి. అంద‌ర్నీ క‌లుపుకుని ప్ర‌జ‌ల్లోకి స‌మ‌ష్టిగా వెళ్లాలి. వారి సీనియారిటీని ఉప‌యోగించి పార్టీని ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర చేస్తే… ఆ త‌రువాత, ప‌ద‌వుల గురించి మాట్లాడుకోవ‌చ్చు. క్షేత్ర‌స్థాయిలో పార్టీ ఉనికే ప్ర‌మాదంలో ప‌డుతూ ఉంటే… త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌డం లేద‌నీ, ప్రాధాన్య‌త పెంచితేనే క్రియాశీలంగా ప‌నిచేస్తామ‌న్న‌ట్టుగా కండిష‌న్లు పెట్టి వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత‌వ‌ర‌కూ సరైందో వారికే తెలియాలి. ఇంకోటి… ఈ ఫోరమ్ పెట్టడం వ‌ల్ల‌, పార్టీలో కొత్త‌గా చేరిన‌వారంతా ఒక గ్రూపు, ఎప్ప‌ట్నుంచో ఉన్న‌వారంతా ఒక గ్రూపు అనే విభ‌జ‌న రేఖ‌ను గీస్తున్న‌ట్టుగా ఉంది. విధేయులంటూ కొత్త‌గా ఉంటారా, పార్టీలో ఉన్న‌వారంతా ఉన్నంత‌కాల‌మూ విధేయులుగానే చూడాలి క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close