ఆర్టీసీని ఇంకా వెన‌కేసుకు రాలేమ‌న్న ప్ర‌భుత్వం..!

కార్మికుల స‌మ్మె విష‌య‌మై చ‌ర్చ‌లు జ‌ర‌పాలంటూ ఆర్టీసీ యాజ‌మాన్యాన్నీ, ప్ర‌భుత్వాన్నీ ఇప్ప‌టికే చాలాసార్లు కోరామ‌ని హైకోర్టు ఇవాళ్ల అభిప్రాయ‌ప‌డింది. త‌మ‌కూ కొన్ని ప‌రిమితులు ఉంటాయ‌నీ, ఇలానే చెయ్యండీ అంటూ ఎవ్వ‌రినీ ఆదేశించ‌లేమ‌ని న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. కోర్టులో ప్ర‌భుత్వం త‌మ వాద‌న‌ల్ని బ‌లంగా వినిపించింది. ఆర్టీసీ స‌మ‌స్య‌లు అంత సులువుగా తీర‌వంటూ ఆర్థిక కార‌ణాల‌ను అధికారులు బ‌లంగా వినిపించారు. రూ. 47 కోట్ల‌తో ఆర్టీసీ స‌మ‌స్య‌లు తీరేవి కాద‌ని కోర్టుకు చెప్పారు. పాత బ‌స్సుల్ని మార్చాల్సి ఉంద‌నీ, అలాంటి బ‌స్సులు 2609 ఉన్నాయ‌నీ, వాటిని మార్చాలంటే రూ. 750 కోట్లు అవ‌స‌ర‌మౌతుంద‌ని నివేదిక‌లో ప్ర‌భుత్వం పేర్కొంది.

రూ. 2,209 కోట్లు బ‌కాయిలు ఆర్టీసీకి ఉన్నాయ‌నీ, ఉద్యోగుల‌కే దాదాపు రూ. 1500 కోట్లు యాజ‌మాన్యం బ‌కాయిలు ఉన్నాయ‌నీ, మొత్తంగా రూ. 5,200 కోట్లుకుపైగా ఆర్టీసీ న‌ష్టాల్లో ఉంద‌ని కోర్టుకి ప్ర‌భుత్వం తెలిపింది. పీక‌ల్లోతు అప్పుల్లో సంస్థ ఉంద‌నీ, ఇప్పుడు దాన్ని ఉద్ధ‌రించ‌డం ఎలా సాధ్యం అనేది ప్ర‌భుత్వ వాద‌న‌. అంతేకాదు, ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు చేస్తున్న స‌మ్మెపై కూడా ప్ర‌భుత్వం మ‌రోసారి త‌న వైఖ‌రిని కోర్టుకు చెప్పేసింది. కార్మికులు చేస్తున్న డిమాండ్లు అర్థం లేనివ‌నీ, వాటిని నెర‌వేర్చ‌డం అసాధ్యం అనేసింది! ఇంకా ఆర్టీసీని వెన‌కేసుకుని వ‌చ్చే ప‌రిస్థితి లేద‌నీ, అందుకే కార్మికుల‌తో ఇప్పుడు చ‌ర్చ‌లు జ‌రిపినా ఉప‌యోగం ఉండ‌ద‌ని చెప్పింది. రెండు గంట‌ల‌పాటు వాద‌న‌లు విన్న కోర్టు… విచార‌ణ‌ను మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది.

ఆర్టీసీని ఇంకా వెన‌కేసుకుని రాలేమ‌ని చెప్పిన ప్ర‌భుత్వం… ప్ర‌త్యామ్నాయ ప్ర‌జా ర‌వాణా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని కూడా కోర్టుకు ఇచ్చిన నివేదిక‌లో స్ప‌ష్టంగా చెప్పిన‌ట్టు స‌మాచారం. అంటే, ప్రైవేటీక‌ర‌ణ త‌మ అంతిమ ల‌క్ష్యం అనేది ఇంకోసారి నొక్కి వ‌క్కాణించింది! ప్ర‌భుత్వ వాద‌న ఎలా ఉందీ అంటే… ఆర్టీసీని ఒక ప్ర‌త్యేక‌మైన సంస్థ‌గా చూపిస్తూ, న‌ష్టాలు వస్తున్నాయి కాబ‌ట్టి… ప్రైవేటీక‌రించ‌డ‌మే ప‌రిష్కారం అన్న‌ట్టుగా ఉంది. ఇవాళ్ల ఆర్టీసీ… రేప్పొద్దున్న ఏదైనా మ‌రో అనుబంధ‌ సంస్థ‌కు న‌ష్టాలు వ‌స్తే దాన్నీ ప్రైవేటీక‌రించేయ‌డ‌మే ప‌రిష్కార‌మా..? అనుబంధ సంస్థ‌లుగా ప్ర‌భుత్వం వీటికి అండ‌గా నిల‌వాల్సింది పోయి, వాటితో మాకు సంబంధం లేదు, మాకే వాళ్లు చాలా డ‌బ్బులివ్వాలంటూ వాద‌న‌లు వినిపిస్తే ఏమ‌నుకోవాలి..? ప్ర‌స్తుతం దాదాపు 50 వేల మంది కార్మికులు చేస్తున్న స‌మ్మె, వారి డిమాండ్లు చెవిటివాడి ముందు శంఖం ఊదిన‌ట్టుగానే ప్ర‌భుత్వం చూస్తోంద‌ని చెప్పాలి. మాన‌వ‌తా దృక్ప‌థంతో ఒక్క మాట కూడా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌దుప‌రి విచార‌ణ‌లో కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూ ధర్మ పరిరక్షణే తిరుపతిలో టీడీపీ అస్త్రం..!

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకుంది. ఎప్పటిలా అభివృద్ధి చేస్తామనో.. మరొకటో చెప్పడం లేదు. ట్రెండ్‌కు తగ్గట్లుగా.. హిందూత్వాన్ని.. హిందూ ధర్మాన్నే హైలెట్ చేసుకోవాలని నిర్ణయించింది. అందుకే.....

కేక్ క‌ట్ చేసి హ‌ర్ట్ చేసిన విజ‌య్ సేతుప‌తి

ఈరోజు విజ‌య్ సేతుప‌తి బ‌ర్త్ డే. త‌మిళంలో త‌నో పెద్ద స్టార్‌. తెలుగులోనూ అభిమానుల్ని ఏర్ప‌ర‌చుకుంటున్నాడు. అయితే.. త‌న పుట్టిన రోజున అనుకోని వివాదంలో ప‌డ్డాడు విజ‌య్ సేతుప‌తి. ఆ త‌ర‌వాత‌.. త‌న...

“డీపీఆర్‌”ల కోసం సీఎంల వెంట పడుతున్న షెకావత్..!

పిట్టపోరు పిల్లి తీర్చిందంటున్నట్లుగా అయింది తెలుగు రాష్ట్రాల మధ్య జల పంచాయతీ. ఎలాంటి లొల్లి లేకుండా ఎవరి ప్రాజెక్టులు వారు కట్టుకుంటే.. కేంద్రానికి ఫిర్యాదు చేసేవాళ్లు ఉండేవారు కాదు. కానీ రాజకీయం కోసం.....

వ్యాక్సిన్‌పై నెగెటివ్‌ ప్రచారం కట్టడి ఎలా..?!

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు అంత ఆతృతగా ఎదురు చూడటం లేదు. అదేదో కరోనా నుంచి కాపాడే వజ్రాయుధం అని ప్రజలు అనుకోవడం లేదు . దాని వల్ల కొత్త సమస్యలు వచ్చి...

HOT NEWS

[X] Close
[X] Close