కేరళకు రూ. 25 కోట్లు..! కేంద్రాన్ని మించిన ఔదార్యం చూపిన కేసీఅర్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ప్రకృతి ప్రకోపంతో విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలిచారు. తెలంగాణ తరపున రూ. 25కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించారు. అలాగే రెండున్నర కోట్ల విలువైన నీటి శుద్ధి యంత్రాలను కూడా పంపుతున్నారు. అదే సమయంలో… కేరళ కోసం.. ఎవరైనా సీఎంల రిలీఫ్ ఫండ్ కు నిధులి ఇస్తే… వెంటనే ఆ రాష్ట్రానికి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 5కోట్లు ప్రకటించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. రూ. 5 కోట్లకు అటూ ఇటూగా.. సాయాన్ని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ప్రధాని మోడీ… కేరళకు వెళ్లారు. అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తారు.

కేసీఆర్ ప్రకటించిన రూ. 25 కోట్ల సాయం.. ఓ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిగ్గుపడేలా చేస్తోంది. సమాఖ్య వ్యవస్థలో…. రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన కేంద్రం … కొన్ని రాష్ట్రాల పట్ల అత్యంత తీవ్రమైన వివక్ష చూపుతోందన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే నిధులను… 57 శాతం తన వద్ద ఉంచుకునే కేంద్రం…. రాష్ట్రాలు ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న సమయంలో ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ నిధిని నిర్వహిస్తూంటుంటంది. అలాంటి ఏర్పాటు ఉన్నప్పటికీ… మోడీ కేరళకు.. కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ప్రకటించారు. సాటి రాష్ట్రాలు … ప్రకటించిన మొత్తంతో పోలిస్తే..ఇది తక్కువే.

గతంలో హుదూద్ తుపాను… విశాఖను చిన్నాభిన్నం చేసినప్పుడు… ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏరియల్ సర్వే చేశారు. భారీగా నష్టం వచ్చిందని… సుందర నగరం ధ్వంసం అయిందని నిర్ణయించి… రూ. 1000 కోట్ల తక్షణ సాయంగా ప్రకటించారు. ఆ తర్వాత నష్టం వివరాలతో… రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పూర్తి నివేదిక పంపింది. కానీ… ప్రధాని ప్రకటించిన రూ. వెయ్యి కోట్లు కూడా ఇంత వరకూ విశాఖకు రాలేదు. అంత మొత్తం నష్టం జరగలేదని చెప్పి.. రూ. 450 కోట్లకు అటూఇటుగానే విడుదల చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా… తమ మార్క్ లెక్కలు తాము వేసుకున్నారు. ఇప్పుడు కేరళ విషయంలోనూ.. మోడీ అదే చేస్తారని.. దాదాపుగా అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే.. ట్రాక్ రికార్డు అలా ఉంది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

బాల‌య్య ఇష్యూ: కేసీఆర్‌పై నెట్టేశారుగా!

`ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు న‌న్ను పిల‌వ‌లేదు` అన్న బాల‌య్య మాట - ప‌రిశ్ర‌మ‌లో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పే అని ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు తేల్చేస్తున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా...

HOT NEWS

[X] Close
[X] Close