తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణా రాష్ట్రంలో చతికిలపడిన రియాల్టీ వ్యాపార రంగం పుంజుకొనేందుకు తెలంగాణా ప్రభుత్వం అనూహ్యమయిన నిర్ణయం తీసుకొంది. ఇంతవరకు 2013 మాస్టర్‌ప్లాన్ నిబంధన ప్రకారం కనీసం పదెకరాలు విస్తీర్ణం ఉన్న లే-అవుట్లకు మాత్రమే అనుమతులు మంజూరు అయ్యేవి. కానీ ఇప్పుడు ఎకరం విస్తీర్ణం ఉన్న లే-అవుట్లకు కూడా అన్ని అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అందుకుగాను శుక్రవారం ఒక జీ.ఓ.(నెంబర్ 102)ని కూడా విడుదల చేసింది. ఇంతకు ముందు ఈ 10ఎకరాల నిబంధన వలన పెద్దపెద్ద రియాల్టీ సంస్థలు కూడా ప్రభుత్వ అనుమతులు పొందలేక అక్రమ లే-అవుట్లు వేసి ప్రజలకు అమ్మడం వలన ప్రజలు చాలా నష్టపోయేవారు. అంతే కాకుండా వాటి వలన ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగడమే కాకుండా న్యాయ పోరాటాల కోసం తిరిగి డబ్బు ఖర్చు చేయవలసి వచ్చేది. ఈ సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని తెలంగాణా ప్రభుత్వం ఎకరం విస్తీర్ణంలో వేసిన లే-అవుట్లకు అనుమతులు మంజూరు చేయాలని నిర్ణయించుకొంది. కనుక ఇకపై చిన్నచిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు కూడా చిన్నచిన్న లే-అవుట్లు వేసుకొనే అవకాశం ఏర్పడింది. దేనివలన తెలంగాణాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అతి తక్కువ సమయంలోనే చాలా వేగం పుంజుకావచ్చును. త్వరలో సింగిల్ విండో విధానంలో ఆన్-లైన్ ద్వారా భవనాలకు, లే-అవుట్లకు అనుమతులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com