హైదరాబాద్ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ తరచూ బెదిరిపులకు పాల్పడుతూండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం అసహనానికి గురవుతోంది. ఆ సంస్థను మెట్రో నుంచి పంపించేయాలని నిర్ణయించుకుంది. L&T మెట్రో రైల్ 2017లో ప్రారంభమైన 29.14 కి.మీ. ఫేజ్-1 నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ PPP మోడల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మైనారిటీ స్టేక్ ఉంది. రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నప్పటికి ఏడాదికి ఆరు వందల కోట్ల నష్టం వస్తోంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల 169 రోజులు మెట్రో షట్‌డౌన్ అయింది. భారీగా నష్టపోయింది.
తెలంగాణ ప్రభుత్వం ఆ సంస్థ వాటా మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న ఆలోచన చేస్తోంది. ఎల్ అండ్ టీ ఎదుట ప్రభుత్వం రెండు ఆఫర్స్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. మొదటిది రూ.15,000 కోట్లకు L&T స్టేక్ కొనుగోలు. ఇందులో రూ.13,000 కోట్ల లోన్ ట్రాన్స్ఫర్,రూ.2,000 కోట్ల నగదు చెల్లింపు ఉంటుంది. రెండవది L&T ప్రైవేట్ గా తన వాటాలు అమ్మేసుకోవడానికి అవకాశం కల్పించడం.
అన్ని అంచనా వేసుకుని L&T 90 శాతానికి పైగా స్టేక్‌ను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉంది. భారీ నష్టాల కారణంగా ఫేజ్-2లో పాల్గొనలేమని స్పష్టం చేసింది. మెట్రో విస్తరణకు పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఎల్ అండ్ టీని సాగనంపాలన్న పట్టుదలతోనే ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వానికి అంత ఆర్థిక సౌలభ్యం ఎక్కడ ఉందన్న ప్రశ్న కూడా వస్తోంది.