కరోనా బాధిత జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ అండ !

జర్నలిస్టుల సంక్షేమంలో మాటలు చెప్పడం కన్నా అంతో ఇంతో ఆచరణలో చూపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ. ఇరవై వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం.. ఆ మహమ్మారి బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకూ అండగా ఉంటోంది. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. రెండు లక్షలు.. ఇతర కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. పదిహేనో తేదీన ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి చెక్కులను పంపిణీ చేయనున్నారు.

జర్నలిస్టులు అందరికీ ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెలంగాణ సర్కార్ కాస్తంత నిజాయితీగానే ఉంటోంది. డెస్క్ జర్నలిస్టులు సహా అందరికీ అక్రిడేషన్లు.. హెల్త్ కార్డులు కూడా ఇచ్చింది. కరోనా బారిన పడిన వారికి తక్షణ సాయం చేసింది. ఈ విషయంలో మీడియా అకాడమీ చైర్మన్‌గా ఉన్న అల్లం నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి విడుదల చేయిస్తున్నారు. దీర్ఘ కాలంగా ఉన్న హౌసింగ్ సొసైటీ సమస్య పరిష్కారం గురించే ఎక్కువ మంది మాట్లాడుతూంటారు కానీ ఇతర సంక్షేమం విషయంలో జర్నలిస్టుల విషయంలో తెలంగాణ సర్కార్ మెరుగ్గా వ్యవహరిస్తోందని చెప్పువచ్చు.

ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇలాంటి సంక్షేమాన్నే ఆశిస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి అక్కడి ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. కరోనాతో చనిపోయిన వారికి రూ. ఐదు లక్షలు ఇస్తామన్న జీవో మాత్రం విడుదల చేశారు. కానీ ఇచ్చారో లేదో స్పష్టత లేదు. ఒక వేళ ఇస్తే.. తెలంగాణకు చెంది కూడా అక్కడి ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న అమర్ లాంటి పెద్ద మనుషులు భారీ కార్యక్రమం పెట్టి సీఎంను వేనోళ్ల పొగిడి ఆ చెక్కులు ఇచ్చి ఉండేవారు. అంటే ఇవ్వలేదనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close