కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాల సమాచారం బీఆర్ఎస్ పార్టీకి ముందే తెలిసిపోతోంది. హిల్ట్ పాలసీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఓ పాలసీని సిద్ధం చేసుకుని కేబినెట్ లో ఆమోదించాలనుకుంది. కానీ రెండు రోజుల ముందే ఆ పాలసీ గురించి పూర్తి సమాచారం కేటీఆర్ కు చేరిపోయింది. కేబినెట్ సమావేశానికి ముందే కేటీఆర్ ప్రెస్మీట్ పెట్టి అందులో వివరాలన్నీ చెప్పి ఆరోపణలు చేశారు. తర్వాత రోజు ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదం తెలిపింది.
కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెడితే ఇకప్రభుత్వ సమాచారం అంతా బీఆర్ఎస్ కు చేరుతుందని క్లారిటీ వచ్చింది. అందుకే లీక వీరులు ఎవరో తెలుసుకుని వారిని శంకరగరి మాన్యాలకు పట్టించడానికి అంతర్గత విచారణ జరిగింది. అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణలో నవంబర్ 20నే ఫొటోషాప్ స్లైడ్స్ బయటకు వచ్చినట్టు గుర్తించారు. 21న హిల్ట్ పాలసీపై ప్రెస్మీట్ పెట్టారు కేటీార్. 22న జీవో విడుదల చేసింది ప్రభుత్వం.
పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలోనే లీక్ చేశారని గుర్తించారు. విజిలెన్స్ విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు నిన్న సిఎస్ రామకృష్ణారావు కు విజిలెన్స్ రిపోర్ట్ అందడంతో.. చర్యలు తీసుకోనున్నారు. లీక్ కు కారణం ఎవరు అనేది, అసలు ఏం జరిగింది అనే దానిపై విజిలెన్స్ పూర్తి రిపోర్టు అందించింది. ప్రభుత్వ పెద్దలు ఇలా ఎంత కాలం నుంచి సమాచారాన్ని విపక్షాలకు పంపిస్తున్నారు.. ఇతర శాఖల్లో ఎంత మంది ఉన్నారో మొత్తం ఆరా తీస్తోంది.ఇప్పుడు అసలు దొంగ దొరికిపోయాడు. అతన్ని వదిలి పెట్టరు.
అత్యంత రహస్య సమాచారాన్ని ఆ వ్యక్తి అందిస్తే కేటీఆర్ తమకు కోవర్టులు ఉన్నారని నిరూపించేలా బయట పెట్టారు. ఇప్పుడు లోతుగా పరిశీలించి ఆ కోవర్టుల్ని పట్టుకుంటున్నారు. అంటే .. కేటీఆర్ కోసం పని చేసి వారు బలైపోయినట్లే.
