తెలంగాణ‌లో ‘సాహో’ ప్రీమియ‌ర్స్ ఉన్నాయా?

ప్రీమియ‌ర్ షోలు, ఫ్యాన్స్ షోల‌కు చ‌మ‌ర‌గీతం పాడింది తెలంగాణ ప్ర‌భుత్వం. ఇది వ‌ర‌కు స్టార్ హీరో సినిమా వ‌స్తోందంటే, అర్థ‌రాత్రి షోల హంగామా ఉండేది. టికెట్ రేటు 1000 నుంచి 2000 ప‌లికేది. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం ఇప్పుడు ఫ్యాన్స్ షోల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం లేదు. ప్ర‌స్తుతం సాహోకీ ఇదే ప‌రిస్థితి ఎదుర‌య్యేలా ఉంది. ఆంధ్ర‌లో రాత్రి 3 గంట‌ల‌కే ఫ్యాన్స్ షోలు వేసే అవ‌కాశం ఉంది. తెలంగాణ‌లో ఉద‌యం 8.45 వ‌ర‌కూ షో వేసే అవ‌కాశాలు లేవు. అయితే సాహో టీమ్ మాత్రం క‌నీసం 30 థియేట‌ర్ల‌లో ప్రీమియ‌ర్లు ప్ర‌ద‌ర్శించ‌డానికి అనుమ‌తులు పొంద‌డానికి తీవ్రంగా కృషి చేస్తోంది. విడుద‌ల‌కు ఒక్క రోజు ముందు అంటే 29వ తేదీన ఓ ప్రీమియ‌ర్ ఉండే అవ‌కాశాలున్నాయి. ఈ షో సినీ ప్ర‌ముఖులు, మీడియాకి ప‌రిమితం చేసే అవ‌కాశం ఉంది. ఫ్యాన్స్ షోలకు అనుమ‌తి లేక‌పోయినా, విడుద‌ల‌కు ఒక్క రోజు ముందు ప్రీమియ‌ర్ వేసుకునే ఛాన్స్ వుంది. ఫ్యాన్స్ షోల‌కు అనుమ‌తి ఇస్తే… ప్రీమియ‌ర్ ఉండ‌దు. ఒకవేళ ఫ్యాన్స్ షోలు వ‌ద్దంటే మాత్రం హైద‌రాబాద్‌లో ఒక రోజు ముందే సాహో షో ప‌డిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close