స‌చివాల‌య కూల్చివేత‌కు అంత తొంద‌రేంటి..?

తెలంగాణ స‌చివాల‌యం కూల్చివేత‌పై దాఖ‌లైన పిటీష‌న్ల‌పై హైకోర్టు విచారించింది. ఇప్ప‌టికిప్పుడు స‌చివాల‌యం కూల్చి, కొత్త‌ది నిర్మించాల్సిన అవ‌స‌రం ఏముందంటూ న్యాయ‌స్థానంలో కొన్ని పిటీష‌న్లు దాఖ‌లైన సంగతి తెలిసిందే. ఇదే అంశమై గ‌తంలో రెండుసార్లు కోర్టులో వాదోప‌వాదాలు జ‌రిగాయి. ఏయే బ్లాకుల్ని కొత్త‌గా నిర్మిస్తున్నారు, వాటి డిజైన్లేంటి, ఎన్నాళ్ల‌లో నిర్మిద్దామ‌నుకుంటున్నారు ఇలాంటి స‌మాచారాన్ని కోర్టుకు ఇవ్వాలంటూ గ‌త విచార‌ణ‌లో ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. అయితే, అప్పుడూ ఇప్పుడూ కోర్టుకు ప్ర‌భుత్వం చెబుతున్న‌ది ఏంటంటే… సెక్ర‌టేరియ‌ట్ కూల్చేద్దామ‌ని కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది, కాబట్టి ముందు కూల్చేస్తాం, త‌రువాత డిజైన్ ఫైన‌ల్ చేస్తాం అని.

ఈ వాద‌న‌తో కోర్టు ఆగ్ర‌హించి… ముందుగా కొత్త భ‌వ‌నం ప్లానింగ్ తీసుకుని రండి అంటూ చెప్పింది. డిజైన్, ప్లానింగ్ పూర్తి కాన‌ప్పుడు కూల్చివేయ‌డానికి ఎందుకంత తొంద‌ర పడుతున్నారు అంటూ ప్ర‌శ్నించింది. కొత్త డిజైన్ త‌మ‌కు స‌మ‌ర్పించాక‌నే కూల్చివేత‌పై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. ముందుగా కూల్చేసి త‌రువాత డిజైన్ ఇస్తామంటే కుద‌ర‌దు అని స్ప‌ష్టం చేసింది. డిజైన్ చేతిలో లేకుండా కూల్చివేత‌కు సంబంధించి మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉందంటూ కోర్టు వ్యాఖ్యానించింది. తదుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కూ కూల్చివేత‌ల‌పై ఎలాంటి నిర్ణ‌యాలు వ‌ద్దంటూ ప్ర‌భుత్వాన్ని న్యాయ‌స్థానం ఆదేశించింది.

స‌చివాల‌య భ‌వ‌నం కూల్చివేత‌కు అన్ని ఏర్పాట్లూ దాదాపు అయిపోయాయ‌నే చెప్పాలి. ఇప్ప‌టికే భ‌వ‌నానికి మార్కింగ్ కూడా చేశారు. కూల్చివేత‌కు యంత్రాంగ‌మంతా సిద్ధ‌మౌతున్న త‌రుణంలో ఈ ప్ర‌క్రియ‌కు హైకోర్టు తాజా ఆదేశాలతో బ్రేకు పడినట్లయింది. నిజానికి, ఉన్న‌ భవనాన్ని కూల్చేసి కొత్త‌ది నిర్మించాల్సిన అవ‌స‌రం ఏముంద‌నే అభిప్రాయం మొద‌ట్నుంచీ ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స‌రిపోయిన స‌చివాల‌యం, ఇప్పుడు ఎందుకు స‌రిపోవ‌డం లేద‌నే ప్ర‌శ్న‌కు ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌మాధానం ఇంతవరకూ లేదు! వంద‌ల కోట్ల ప్ర‌జాధ‌నం ఎందుకు వృథా చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు ఎన్ని వినిపిస్తున్నా… ఈ విష‌యంలో ప్ర‌భుత్వం దూకుడుగానే ముందుకు వెళ్తోంది. వీలైనంత త్వరగా కొత్త భవనం కట్టేయాలన్న పట్టుదలే ప్రతీ దశలోనూ కనిపిస్తోంది. ఇప్పుడు, కోర్టు కోరినట్టుగా డిజైన్ సిద్ధం చేసి ఇచ్చాశాక, తదుపరి ఆదేశాలు ఎలా ఉంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలకు మించిన భారంగా సభ్యత్వాలు..!

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లోపు.. సభ్యత్వాల పని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గంలో కనీసం యాభై వేల సభ్యత్వాలు కావాలని... పార్టీ నేతలకు...

చైతన్య : ఏపీలో వీసీలందు వైసీపీ వీసీలు వేరయా..!

వైస్ చాన్సలర్ అంటే ఓ యూనివర్శిటీ మొత్తానికి మార్గనిర్దేశుడు. ఆయనే దారి తప్పితే ఇక యువత అంతా దారి తప్పినట్లే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పరిస్థితి ఇంతే ఉంది. ప్రభుత్వం కూడా.. వారు...

నాగ‌చైత‌న్య‌కు క‌లిసొచ్చిన స్ట్రాట‌జీ

నాగ‌చైత‌న్య టాప్ స్టారేం కాదు. త‌న సినిమాలు 40 - 50 కోట్ల బిజినెస్‌లు చేసిన దాఖ‌లాలు లేవు. సినిమాపై ఎంత బ‌జ్ వ‌చ్చినా... ఈలోపే మార్కెట్ జ‌రుగుతుంది. అయితే `ల‌వ్ స్టోరీ`...

ఇంద్ర‌గంటి చెప్పే.. అమ్మాయి క‌బుర్లు!

సుధీర్‌బాబు - ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇది వ‌ర‌కు వీరిద్ద‌రూ క‌లిసి `స‌మ్మోహ‌నం`, `వి` చిత్రాలు చేశారు....

HOT NEWS

[X] Close
[X] Close