నాగేశ్వ‌ర‌రావు గారి… గీతా గోవిందం

గీత గోవిందంతో వంద కోట్ల సినిమా అందించాడు ప‌ర‌శురామ్‌. అయితే ఆ సినిమా అంత హిట్ట‌యినా, త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డంలో బాగా టైమ్ తీసేసుకున్నాడు. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా ఖాయం చేసుకున్నాడు. ఈ సినిమాకి ‘నాగేశ్వ‌ర‌రావు’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. టైటిల్ మారినా.. ప‌ర‌శురామ్ పంథాని మాత్రం మార్చ‌బోవ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇప్పుడు ఈ క‌థ కూడా `గీత గోవిందం`ని పోలి ఉంటుంద‌ట‌.

గీత గోవిందం – ఓ అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య సాగిన మిస్ అండ‌ర్‌స్టాండింగ్‌. అపార్థాల ముసుగు తొలిగి, ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డడ‌మే క‌థ. ‘నాగేశ్వ‌ర‌రావు’ లైన్ కూడా ఇలానే ఉంటుంద‌ట‌. కాక‌పోతే ‘గీత గోవిందం’లో అబ్బాయిని అమ్మాయి అపార్థం చేసుకుంటుంది. ఈసారి అమ్మాయిని అబ్బాయి అపార్థం చేసుకుంటాడు. అంతే తేడా. ఇందులో చైతూ లుక్ కూడా కొత్త‌గా ఉంటుంద‌ని, మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి నాగేశ్వ‌ర‌రావు అన‌బ‌డే గీత గోవిందం 2.. ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close