తెలంగాణ ప్రభుత్వం అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదని హైకోర్టులో బీఆర్ఎస్ నేత పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు నాలుగు వారాల్లో జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆదేశించింది. సాధారణంగా జీవోలన్నీ జీవోఐఆర్ వెబ్ సైట్లో పెడతారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పెడుతోంది. కానీ వాటి సంఖ్య చాలా అంటా చాలా స్వల్పం.
అధికారిక లెక్కల ప్రకారం గత 13 నెలల కాలంలో 19,064 జీవోలు జారీ అయితే అందులో 3,290 జీవోలను మాత్రమే అప్ లోడ్ చేశారు. సాధారణంగా బదిలీలు, నిధుల కేటాయింపులు, విధానపరమైన నిర్ణయాలు జీవోల రూపంలో వెలువడతాయి. కీలకమైన అంశాలను కాన్ఫిడెన్షియల్ కేటగిరీ కింద ఉంచడం లేదా ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయకపోవడం చేస్తూంటారు. కానీ ప్రతి నిర్ణయం కాన్ఫిడెన్షియల్ అన్నట్లుగా చేయడం మాత్రం విమర్శలకు గురవుతోంది.
బీఆర్ఎస్ హయాంలోనూ తక్కువేమీ కాదు. 2014 నుంచి 2019 వరకు ఏకంగా 43,462 ప్రభుత్వ జీవోలను కేసీఆర్ ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ గా ఉంచంది.
2014-19 మధ్య ప్రభుత్వం 1,04,171 జీవోలు తెస్తే అందులో 60,709 జీవోలను మాత్రమే పబ్లిక్‌లో ఉంచి మిగతావి దాచిపెడింది. అప్పట్లో కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు జీవోలను పబ్లిక్ కు అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ప్రభుత్వం మారినా రేవంత్ సర్కార్ జీవోలను అప్ లోడ్ చేయడంలేదు.
