మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎక్స్ ఆఫీషియో ఓట్లతో గెలిచే అవకాశం ఉన్నా.. బాల్క సుమన్ చేసిన ఉద్రిక్తతల ప్లాన్ లో కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తోందన్న భావన కల్పించేలా చేయగలిగారు. మంత్రి వివేక్ నియోజకవర్గంలో ఉన్న క్యాతన్ పల్లిని డీల్ చేయడంలో ఆయన విఫలమైనట్లుగా కనిపిస్తోంది.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా, ఇటీవల వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్ అత్యధికంగా 11 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. అధికార కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలను దక్కించుకోగా, బీజేపీ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు రెండు చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ సగం సీట్లు సాధించినా మెజార్టీ లేదు.
కానీ స్వతంత్రులు, ఎమ్మెల్యే , ఎంపీ ఎక్స్-అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రచ్చ ప్లాన్ చేశారు. మున్సిపల్ సమావేశం సందర్భంగా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి.. వివేక్ కారుపై దాడి చేయించారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దాంతో కేసులయ్యాయి. మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది. వరుసగా మూడో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగించింది. చివరికి బాల్క సుమన్ ను అరెస్టు చేశారు.
ఈ వ్యవహారం మొత్తంలో బాల్క సుమన్ ను అరెస్టు చేసినా.. అక్కడేదో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తే కాంగ్రెస్ కౌన్సిలర్లను లాగేసుకుని గెల్చుకుంటుందన్న భావన కల్పించడంలో సఫలమయ్యారు. ఇలాంటి రాజకీయ పోరాటాలు బాల్క సుమన్ చేస్తారని ఊహించలేక మంత్రి వివేకా డిఫెన్సివ్ రాజకీయాలు చేస్తున్నారు.
