రేసులో ఉన్న స్వతంత్రులకు రేట్లు ఖరారు చేస్తున్నారా..?

తెలంగాణలో ఓ భిన్నమైన రాజకీయ వాతవరణం కనిపిస్తోంది. అటు టీఆర్ఎస్‌కు కానీ.. ఇటు కాంగ్రెస్‌కు కానీ… సర్వే సంస్థలు 30 సీట్ల నుంచి లెక్క ప్రారంభిస్తున్నాయి.. అవి 90 వరకూ తీసుకెళ్లిపోయాయి. దాంతో..ఎవరికీ వాటిపై నమ్మకం లేకుండా పోయింది. అన్నింటినీ విశ్లేషించుకున్న తర్వాత రాజకీయ పార్టీలు కూడా హంగ్ రావొచ్చన్న అభిప్రాయానికి వచ్చాయి. అందుకే.. దాహమైనప్పుడు బావి తవ్వుకునే ప్రయత్నాలు కాకుండా.. ముందుగానే గెలవబోయే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతును “కొనుగోలు” చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే.. చర్చలు ప్రారంభమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది.

లగడపాటి రాజగోపాల్ చెప్పిన సర్వే ప్రకారం 7 నుంచి 8 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారు. ఆయన మొత్తంగా ఐదు పేర్లు చెప్పారు. మరో మూడు పేర్లు గోప్యంగా ఉంచారు. లగడపాటి చెప్పిన ఈ ఐదు పేర్లూ.. ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవాల్సినవి కావు. వారంతా రేసులో ఉన్నారని.. రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ప్రకటించని.. మరో ఇద్దరు ముగ్గురెవరనేదానిపైనా.. పోలింగ్ తర్వాత అందరూ అవగాహనకు వచ్చారు. ఇప్పుడు వారందర్నీ.. తమ వైపు తిప్పుకునేందుకు రెండు ప్రధాన పార్టీలు గాలాలు రెడీ చేశాయి. దక్షిణ తెలంగాణలో ఓ కీలక నియోజకవర్గం నుంచి గెలుస్తారని లగడపాటి ప్రకటించిన అభ్యర్థికి… ముందుగానే ఓ ప్రధాన పార్టీ ధన సహాయం చేసిందట. గెలిచిన తర్వాతా ప్రాధాన్యతను బట్టి మంత్రి పదవి వరకూ ఆయనకు హామీ దొరికిందని చెబుతున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో కచ్చితంగా గెలుస్తాడని భావిస్తున్న రెబల్ మల్ రెడ్డి రంగారెడ్డికి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి… ముందుగానే మద్దతు ప్రకటించి గాలం వేసేశారు.

గెలుస్తారని చెబుతున్న ఇండిపెండెంట్లలో ఒక్క మక్తల్ నుంచి రేసులో ఉన్న జలంధర్ రెడ్డి మినహా మిగతా అంతా కాంగ్రెస్ పార్టీ రెబల్సే. అయితే సొంత పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా వారు పోటీ చేశారు. అలాంటిది వారు మళ్లీ కాంగ్రెస్ వైపునకు మద్దతిస్తారా అన్న సందేహం చాలా మందిలో ఉంది. అందుకే ఇలాంటి వారందరికీ టీఆర్ఎస్ ఇప్పటికే పెద్ద పెద్ద ప్యాకేజీలు రెడీ చేసిందంటున్నారు. ప్రాథమిక చర్చలు కూడా జరిపారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఓ రకంగా వెనుకబడినా.. అంతా తమ అభ్యర్థులే కాబట్టి… చివరికి వారిని ఏదో ఒక హామీ ఇచ్చి తమ వైపునకు లాక్కుంటామంటున్నారు. మొత్తానికి ఇప్పటికైతే స్వతంత్రులకు ఎక్కడ లేనంత డిమాండ్ ఉంది. ఫలితాల తర్వాత ఎలా ఉంటుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close