మజ్లిస్‌ను వదిలేస్తే మేం మద్దతిస్తాం..! టీఆర్ఎస్‌కు బీజేపీ ఓపెన్ ఆఫర్..!!

తెలంగాణలో హంగ్ వస్తుందని.. భారతీయ జనతా పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఎలా వచ్చినా… తమకు పీఠం రాదు కాబట్టి… కాంగ్రెస్ పార్టీ… మాత్రం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా.. ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి.. ముందస్తు సంకేతాలు రాకుండానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు… ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. మజ్లిస్‌తో సంబంధాలు తెంచుకుంటే.. టీఆర్ఎస్‌కు తామే మద్దతిస్తామని ప్రకటించారు. యాంటీ కాంగ్రెస్, యాంటీ మజ్లిస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

పోలింగ్ కు ముందు.. బీజేపీ నేతలు.. తాము టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు షో చేశారు. కానీ వాళ్లు టీఆర్ఎస్‌ కోసమే… 118 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టారన్న విషయం మాత్రం స్పష్టమయింది. బలం ఉన్న 30 నియోజకవర్గాల్లో మాత్రమే.. అభ్యర్థులను నిలబెట్టాలని మొదట్లో అనుకున్నా.. అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ కాకుండా… కొన్ని ఓట్లను చీల్చడానికి బీజేపీ అన్ని చోట్లా రంగంలోకి దిగింది. వ్యక్తిగతంగా బలం ఉన్న అభ్యర్థులు రంగంలో ఉన్న చోట బీజేపీ.. విజయం కోసం రేసులోనే ఉంది. అందుకే ఆ పార్టీకి మూడు నుంచి ఏడు సీట్లు వస్తాయన్న విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ కారణంగానే బీజేపీ నేతలు ఊహాల్లో తెలిపోతున్నారు. తమ ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని ధీమాతో ఉన్నారు.

హంగ్ వస్తే మాత్రం… టీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మజ్లిస్ నుంచి మద్దతు తీసుకుంటే.. వాళ్లు పెట్టే టార్చర్ భరించడం అంత తేలిక కాదు. ఇప్పటికే అక్బురద్దీన్ తాను తెలంగాణ కుమారస్వామినవుతానని ఊహాల్లో ఉన్నారు. లేకపోతే.. ఎవరైనా తమ ముందు తల వంచాల్సిందేనంటున్నారు. ఇక బీజేపీ మద్దతు తీసుకుంటే… వచ్చే నాలుగైదు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ముస్లింల మద్దతు దూరం అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే..బీజేపీ విషయంలోనే.. కేసీఆర్‌కు కాస్త అడ్వాంటేజ్ ఉంది. మోడీతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల.. పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పే… ముందస్తు ఎన్నికల విషయంలో .. కేసీయార్ సంపూర్ణ సహకారం పొందారని ..ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. అంటే… హంగ్ అంటూ వస్తే.. కేసీఆర్ బీజేపీ వైపే మొగ్గే అవకాశం ఉంది. అందుకే రెండు పార్టీలు ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close