సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏపీ సర్కార్.. కేఆర్ఎంబీకి లేఖ రాసింది. కానీ ఇక్కడ తెలంగాణ సర్కార్ తిరకాసు పెట్టింది. శ్రీశైలంలో ఏపీకి కుడిగట్టు కింద విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ… పోతిరెడ్డి పాడు నుంచి మాత్రం నీళ్లు విడుదల చేయవద్దని లేఖ రాసింది. ఏపీ వాటా కింద విద్యుత్ ఉత్పత్తి చేస్తే.. ఆ నీరు దిగువకు వెళ్తుంది.

అంటే నాగార్జున సాగర్ కు వెళ్తుంది. కానీ రాయలసీమకు వెళ్లదు. రాయలసీమకు వెళ్లాలంటే.. పోతిరెడ్డి పాడు ద్వారా రిలీజ్ చేయాలి. ఇప్పుడు.. శ్రీశైలం నిండింది. గేట్లు ఎత్తారు. కానీ రాయలసీమకు మాత్రం నీళ్లు పంపలేకపోతున్నారు. గేట్లు ఎత్తినా దిగువకు.. అంటే సాగర్‌కే నీరు చేరుకుంది. ఇక్కడే ఏపీ సర్కార్‌కు చిక్కులు ప్రారంభమయ్యాయి. వీలైనంత త్వరగా తమకు పోతిరెడ్డి పాడు నుంచి నీరు విడుదలను పెంచాల్సి ఉంది. కానీ తెలంగాణ అభ్యంతర పెట్టింది. కృష్ణాబేసిన అవసరాలకే అనుమతి ఇవ్వాలని కోరుతోంది.

దీనిపై.. కృష్ణాబోర్డు.. కేంద్రం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తి స్థాయిలో పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల.. నెల రోజుల పాటు చేస్తే కానీ.. పూర్తి స్థాయిలో సీమలో అందుబాటులో ఉన్న సామర్థ్యం మేరకు నీరు నిల్వ చేసుకునే పరిస్థితి ఉండదు. అనుమతి లేని కారణంగా.. తెలంగాణ అభ్యంతర పెట్టిందన్న కారణంగా … పోతిరెడ్డి పాడు నుంచి నీటి విడుదల ఆపాలని … కేఆర్ఎంబీ ఆదేశిస్తే మాత్రం. ఇబ్బందికర పరిస్థితులు.. సీమ ప్రజలకు ఎదురవుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎయిడెజ్ కాలేజీలపై ప్రభుత్వ విధానంతో మైనస్సే !

దశాబ్దాలుగా విద్యా సేవ అందిస్తున్న ఎయిడెడ్ కాలేజీలను అయితే ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేకపోతే ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానివిగానే సాగుతున్నాయి....

తెలంగాణలో కూడా ప్రభుత్వ మటన్ !

ఏపీ ప్రభుత్వం మటన్ మార్టుల పేరుతో ఓ కాన్సెప్ట్‌ను ‌తమ అధికార మీడియా ద్వారా ప్రజలకు తెలియచెబితే జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరికి పశుసంవర్థక మంత్రి అలాంటి ఆలోచనలేదని. అలా...

కేశినేనివి బెదిరింపులా ? నిజంగానే విరక్తి చెందారా ?

కేశినేని నాని ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లుగా టీడీపీని వ్యతిరేకించే.. వైసీపీకి దగ్గరగా ఉండే మీడియాలో ప్రచారం జరిగింది. ఆయనే ఈ విషయాన్ని చెప్పినట్లుగా ఆ మీడియా చెప్పుకొచ్చింది. తన ఆశక్తతను...

టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి కూడా కామెడీ అయిపోతోందా !?

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లుగా చెలామణి అయ్యే కొంత మంది నాయకులను రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం సైడ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. కలసి వస్తే సరే లేకపోతే వారి అసంతృప్తిని కూడా లెక్కలోకి రాకుండా...

HOT NEWS

[X] Close
[X] Close