మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్ చేసుకున్నారు. కానీ మీడియా సంస్థలో పని చేసేవారికి కూడా.. యాజమాన్యం మారిందా అన్నదానిపై గిల్లుకుని చూసుకోవాల్సి వచ్చింది. అలాంటిదేమీలేదు. మరి ఎందుకు పుకారు పుట్టించారు అంటే…. నిప్పులేనిదే పొగ రాదన్నట్లుగా… టీవీ5పై వ్యతిరేకత చూపించే పార్టీ వారికి.. ఓ అంశం దొరికింది. దాన్ని పట్టుకుని టీవీ5ని అమ్మేశారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ప్రతీ నెలా అనుమతి పొంది టీవీ చానళ్ల కంపెనీల పేర్లు, వాటి డైరక్టర్ల పేర్లను అప్ డేట్ చేస్తూ ఉంటుంది. అలా నెల క్రితం అప్ డేట్ చేసిన లిస్ట్‌లో శ్రేయా బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ డైరక్టర్ల పేర్లను ఉత్తరాది పేర్లతో నింపేశారు. శ్రేయా బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ టీవీ5తో పాటు మరో రెండు చానళ్లను నడుపుతోంది. దీంతో టీవీ5ను అమ్మేశారని హోరెత్తించారు. నిజానికి ఆ ఉత్తరాది వారి కంపెనీ శ్రేయ కాదు శ్రేయార్థ్… వాళ్లు జీఎస్ టీవీ అనే దాన్ని నడుపుతున్నారు.

అక్కడే తప్పు జరిగింది. దాన్ని ఆలస్యంగా గుర్తించారు టీవీ5 అంటే కోపం ఉన్నపార్టీల కార్యకర్తలు. దీంతో రచ్చ అయింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం టీవీ5 పై రకరకాల ఆరోపణలు చేస్తోంది. రఘురామకృష్ణరాజుతో యూరోల ఒప్పందం జరిగిందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అయితే నిజానికి అలాంటిదేమీ లేదని తెలియడంతో.. కాసేపు ప్రచారం చేసుకుని తృప్తి పడ్డామన్న సంతృప్తి మాత్రమే వారికి మిగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close