ఎడిటర్స్ కామెంట్ : “ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్” ..

“ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్” .. హెన్సీ కేట్ అనే పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్య ఇంది. దశాబ్దాలు దాటి.. శతాబ్దాలు వచ్చినా ఈ మాటల్లో చిక్కదనం పోలేదు. ఇండియా లాంటి దేశాల్లో రోజు రోజుకు .. నిజమే అనిపించేలా కనిపిస్తోంది. దానికి తాజా ఉదాహరణ.. పార్లమెంట్‌లో కేంద్రం చెప్పిన ఓ సమాధానం. దేశంలో అసలు ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలే సంభవించలేదట. ఈ విషయాన్ని ఏ మాత్రం సిగ్గుపడకుండా… తడుముకోకుండా కేంద్రం చెప్పింది. నవ్విపోదురుగాక నాకేమి అనుకుంది. కానీ నిజంగా .. మన దేశంలో ఆక్సిజన్ మరణాలు లేవని వాదించేవారు ఒక్క ప్రభుత్వంలోనే కాదు.. ఆ ప్రభుత్వ మైకం కమ్మిన వారు కూడా ఉన్ారు. అందుకే… “ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్” అనేది.

సెకండ్‌వేవ్‌లో చనిపోయిన లక్షల మందికి ఆక్సిజన్ అందిందా..!?

ఆక్సిజన్ మరణాలు లేవా..?.కరోనా సెకండ్ వేవ్ రాదు రదంటూ నమ్మకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కరోనా గట్టి షాకే ఇచ్చింది. ఒక్క సారిగా విరుచుకుపడింది. నిజమేనా అని అనుకునేలోపే మారణ హోమం ప్రారంభమయింది. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో స్మశానాలన్నీ హౌస్ ఫుల్ బోర్డులు పెట్టాయి. కాలబెట్టడానికి కట్టెలు దొరకని దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఎక్కువగా ఆక్సిజన్ కొరత మరణాలే. అందుకే భారత్‌కు ఊపిరి ఆడటం లేదంటూ ప్రపంచదేశాలు పెద్ద ఎత్తున ఆక్సిజన్ పరికరాలు పంపించాయి. ఇవాళ దేశంలో ఊరికి పది ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు ఉన్నాయంటే దానికి కారణం .. ఈ ఆక్సిజన్ మరణాలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎదురుగా నిజాలు కళ్ల ముందు కనిపిస్తూండగా.. కేంద్రం మాత్రం నిస్సంకోచంగా… అబద్దమాడేసింది.

ప్రజల ప్రాణాల్ని బలిపెట్టి.. అసలు అలాంటి మరణాలే లేవని దబాయించే పాలన..!

ప్రజల ప్రాణాలు బలైపోయినా.. ఇంత దారుణంగా అబద్దాలాడటం మన పాలకులకే చెల్లింది. ఇది పాలకులకు అవమానం కాదు. వాళ్ళు చెబుతుంటే కళ్ళప్పగించి వింటున్న వాళ్ళందరికీ అవమానం. గంగానదిలో శవ ప్రవాహాలూ, తిరుపతి రుయా ఆసుపత్రిలో ప్రాణవాయువు లేక ప్రాణాలొదలటం … ఢిల్లీ ఆసుపత్రుల ముందు ఆక్సిజన్‌ కోసం అల్లాడిన ప్రాణాలు… గుజరాత్‌, మహారాష్ట్ర, బెంగుళూరు, రాజస్థాన్‌, గోవా, మధ్యప్రదేశ్‌లలో ఇంకా ఇంకా ఎన్నో చోట్ల సిలెండర్ల లేమితో చివరి శ్వాసలు వొదిలిన ఘటనలు ఇప్పటికీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే కేంద్రం తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. రాష్ట్రాలే ఆ నివేదికలు ఇచ్చాయని చెప్పుకొచ్చింది. మేం ఆక్సిజన్‌ అందించలేకపోవటం వల్ల ఇంత మంది చనిపోయారని ఏ రాష్ట్రమైనా చెబుతుదా..? . కరోనా విషయంలోపూర్తి అధికారాన్ని చెలాయించి… ఆక్సిజన్ మరణాల విషయంలో రాష్ట్రాల సమాచారమే చెప్పామనడం.. విడ్డూరం.

ప్రజల విమర్శలు చట్టుకోలేక ఇప్పుడు కొత్తగా రాష్ట్రాలను వివరాలడిగిన కేంద్రం..!

కేంద్రం తీరుపై ప్రజలు మరో రకంగా అనుకునే ప్రమాదం ఏర్పడటంతో … విమర్శలు రావడంతో.. తీరిగ్గా కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనంలో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆగస్టు 13లోగా ఈ సమాచారాన్ని సమర్పించాలని కోరింది. అంటే ఇప్పటి వరకూ రాష్ట్రాలు ఇచ్చిన సమాచారం మేరకే .. ఆక్సిజన్ కొరత మరణాల్లేవని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కానీ అసలు విషాలను ఎప్పుడూ చెప్పరు. ఎవరూ చెప్పరు. ప్రజల్ని మాత్రం అలా మభ్యపెడుతూనే ఉంది.

కరోనాను తట్టుకుని బతికున్న వారందర్నీ కేంద్రమే కాపాడినట్లా..?

పాలకులు అంటే.. ప్రజలను పాలించేవాళ్లు. వారిని కాపాడేవాళ్లు. కరోనా బరిన పడి.. చనిపోయినవారు పోగా.. మిగిలిన వారందర్నీ తామే బతికించామని చెప్పుకునే గడుసు రాజకీయ నేతల మధ్య .. ప్రస్తgతం భారత దేశం నడుస్తోంది. అందుకే.. ఆక్సిజన్ మరణాలు లేవని అంత ధైర్యంగా చెప్పగలిగారు. ప్రజల నుంచి ఆగ్రహం వెల్లువెత్తితే తప్పుదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అంటారు.. “ది ప్రాబ్లమ్ విత్ పొలిటికల్ జోక్స్ ఈజ్ దట్ దే గెట్ ఎలక్టెడ్” ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పంజాబ్ కాంగ్రెస్ చిందర వందర !

అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదో చేద్దామని ప్రయత్నించిన కాంగ్రెస్ హైకమాండ్... పంజాబ్ లో పార్టీని చిందర వందర చేసుకుంది. సిద్దూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి అందర్నీ కూల్ చేయాలనుకుంటే చివరికి అదే...

వైసీపీ గ్రామ సింహాలు ఇప్పుడు ఎక్కడ: పవన్ కళ్యాణ్

సినీ పరిశ్రమ సమస్యలపై పవన్ కళ్యాణ్ మాట్లాడగానే వైఎస్ఆర్సిపి మంత్రులందరూ వరస పెట్టి పవన్ కళ్యాణ్ పై ముప్పేట దాడి చేసిన సంగతి తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ అక్కడితో ఆగకుండా...

బాహుబలి లెక్కలు బయటకు తీస్తామని సజ్జల హెచ్చరిక !

సినీ ఇండస్ట్రీ విషయంలో ప్రభుత్వం తీరుపై పవన్ కల్యాణ్ విమర్శల నేపధ్యంలో ఆయనకు మద్దతు పెరగకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి బాహుబలి...

మిత్రుడికి కనీసం సంఘిభావం చెప్పని ఏపీ బీజేపీ !

మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు తిట్ల దండకం వినిపించడంపై ఏపీ బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. తమ మిత్రునికి కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వడం...

HOT NEWS

[X] Close
[X] Close