ఆర్బీఐ రిపోర్ట్ : విడిపోయాక తెలంగాణ బంగారమే !

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారంగా మారిపోయింది.ఈ విషయాన్ని ఆర్బీఐ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే 2014-15లో 29,288 కోట్లు ఇప్పుడు 2020-21లో ఆదాయం 85,300కోట్లు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి నుంచి ఏడేళ్లలో జీఎస్డీపీ ఏకంగా 117 శాతం వృద్ధి నమోదు చేసింది. ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఔషధ రంగ పరిశ్రమలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ అద్భుత వృద్ధి సాధించింది.  సొంత పన్నులు, పన్నేతర ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఐటీ, తయారీ, పారిశ్రామిక, వ్యవసాయ, మైనింగ్‌ రంగాలు గణనీయ వృద్ధి సాధించడంతో ఖజానాకు రాబడి పెరిగింది. 2014-15తో పోల్చితే.. 2020-21 నాటికి పన్నేతర ఆదాయం 474 శాతం, పన్నుల ఆదాయం 291 శాతం పెరిగింది.

ఏడేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలు గణనీయంగా వృద్ధిని నమోదు చేయడంతో.. రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటితో పోలిస్తే మూడింతలకుపైగా రాబడి వృద్ధి నమో దైంది. పన్నుల రాబడితోపాటు పన్నేతర ఆదాయాన్నీ ప్రభుత్వం పెంచుకోగలిగింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు కూడా మూడింతలు పెరిగాయి. వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధిలో రాష్ట్రం మెరుగైన పనితీరు ప్రదర్శించింది. వరి, పత్తి, పప్పుధాన్యాల ఉత్పత్తిలో దేశ సగటుకన్నా 3, 4 రెట్లకుపైగా వృద్ధి నమోదయింది.

పెరిగిన ఆదాయానికి తగ్గట్లుగా తెలంగాణ ప్రభుత్వం అప్పులు కూడా చేసింది. 2021 మార్చి నాటికి రూ.2,52,325 కోట్లకు చేరాయి. ఆరేళ్లలో రూ. 1 లక్షా 80వేల కోట్ల వరకూ అప్పులు చేశారు. కానీ పెరిగిన ఆదాయంతో పోలిస్తే ఈ అప్పు పెద్ద భారం ఏమీ కాదు.  అప్పులతో కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టడంతో  అప్పులకు తగ్గ సంపద సృష్టి జరిగింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీని గంట తిట్టి “ధాన్యం భారం” దించేసుకున్న కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెట్టారు. మంత్రివర్గ సమావేశం నిర్వహించిన తర్వాత అందులో తీసుకున్న నిర్ణయాలపై ఈ ప్రెస్ మీట్ పెట్టలేదు. కేవలం బీజేపీని...

వరద నష్టం అంచనాకొచ్చారా ? జగన్ పనితీరుకా ?

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను అతలాకుతరం చేసిన వరద పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కలిసింది. అంతకు ముందు మూడు రోజుల పాటు వారు క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వీరు...
video

30 సెకన్ల టీజర్ తో బాలీవుడ్ ని షేక్ చేసిన రాధేశ్యామ్

https://youtu.be/ybq28UyxDTg పాన్ ఇండియా ఫ్యాన్స్ ని ఊరిస్తున్న సినిమాల్లో ప్రభాస్ "రాధేశ్యామ్" కూడా వుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ప్రమోషన్స్ మెటిరియాల్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా హిందీ సాంగ్...

డ్వాక్రా మహిళల “పెన్షన్ బీమా” సొమ్ములు కూడా విత్ డ్రా !

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళల కోసం అభయహస్తం అనే పధకం ప్రారభించారు. ఈ పథకం ప్రకారం డ్వాక్రా మహిళల వద్ద నుంచి ఏడాదికి రూ.365 ప్రీమియం వసూలు చేస్తున్నారు....

HOT NEWS

[X] Close
[X] Close